BHARAT WILL EMERGE SUPER POWER NATION-UNION MINISTER _ శ్రీ‌వారి అనుగ్ర‌హంతో భారత్ అత్యంత శక్తి మంతమైన దేశంగా ఉండాలి – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి

Tirumala, 14 Nov. 20: On this auspicious festival of Diwali, I prayed Lord Venkateswara to bestow His benign blessings on the country and make it a super power nation in the world, said Honourable Union Minister of State for Home Affairs Sri G Kishen Reddy.

Speaking to media outside the temple after darshan on Saturday he said, the tensions prevailing at border due to the intrusion of China and Pak forces should be overcome and Bharat should emerge as a Super Power Nation.

He said, he also prayed lord to save the world from the clutches of Coronavirus and give enough strength to Honourable Prime Minister Sri Narendra Modi and Honourable Home Minister Sri Amit Shah in their sincere endeavours to make Bharat a Supreme Power on the Globe.

Earlier he was accorded welcome by TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Jawahar Reddy.

After darshan he was rendered Veda Asirvachanam by Vefic pundits at Ranganayakula mandapam.

Later he was presented theertha prasadams.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి అనుగ్ర‌హంతో భారత్ అత్యంత శక్తి మంతమైన దేశంగా ఉండాలి –  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి                        

తిరుమల, 14 నవంబరు 2020: ప్రపంచంలో భారత్ అత్యంత శక్తి మంతమైన దేశంగా తయారయ్యే శక్తి ప్రసాదించాలని, చైనా, పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు  తొలగించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి చెప్పారు.

శనివారం ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ కిషన్ రెడ్డికి అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ఆయనకు స్వామి వారి ప్రసాదాలు అందించారు.

అనంతరం శ్రీ కిషన్ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. దేశాన్ని అత్యంత బలవంతంగా తయారు చేయడానికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, హోంమంత్రి శ్రీ అమిత్ షా లకు  ఆరోగ్యం, శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లు  మంత్రి చెప్పారు. దీపావళి రోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయతో త్వరలోనే కరోనా నశిస్తుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు
                     
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారు   ప్రజలందరికీ ఆరోగ్యం, సంతోషం ప్రసాదించాలని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు                                       

 టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది