GOKULASTAMI ASTANAM HELD _ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం

TIRUMALA, 30 AUGUST 2021: Gokulastami Asthanam was held with religious fervour in Sri Venkateswara Swamy temple at Tirumala on Monday evening on the auspicious occasion of Sri Krishna Janmashtami.

Ekanta Tirumanjanam was performed to Sri Ugra Srinivasamurty, Sridevi Bhudevi and Sri Krishnaswamy followed by Dwadasaradhanam, Prabandha Gosti and Purana Pathnam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం

తిరుమల, 2021 ఆగస్టు 30: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవేంకటేశ్వర స్వామిని సాక్షాత్తు  ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా భావించి ఆస్థానం నిర్వహిస్తారు.

రాత్రి 7 నుండి 8 గంటల నడుమ  శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహించారు.  అనంతరం ద్వాదశారాధనం చేపట్టారు. శ్రీకృష్ణ స్వామివారిని బంగారు సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసి ప్రబంధగోష్ఠి, పురాణ పఠనం చేపట్టారు.

 ఆగ‌స్టు 31న ఉట్లోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని సాయంత్రం 4 నుండి 5 గంటల వర‌కు శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.