GOKULASTAMI PERFORMED IN ALL TTD TEMPLES _ టిటిడి స్థానిక ఆలయాల్లో శాస్త్రోక్తంగా గోకులాష్టమి

TIRUPATI, 30 AUGUST 2021: Gokulastami festivities was observed with the religious fervour in all TTD temples in and around Tirupati on Monday.

The Asthanam was performed at Tiruchanoor after offering special puja to Sri Venugopala Swamy. Similarly, religious rituals were performed in sub-shrines dedicated to Sri Krishna Swamy at Kapileswara Swamy temple, Narayana vanam, Chandragiri Ramalayam.

While special festivities were performed at Sri Venugopala Swamy temple at Karvetinagaram on the occasion.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి స్థానిక ఆలయాల్లో శాస్త్రోక్తంగా గోకులాష్టమి

తిరుపతి, 2021 ఆగస్టు 30: టిటిడి స్థానిక ఆలయాల్లో సోమవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకలు ఆయా ఆలయాల్లో ఏకాంతంగా నిర్వహించారు.

తిరుచానూరులో….

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీ కృష్ణస్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు.

అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామివారు పెద్దశేష వాహనాన్ని అధిష్టించి దర్శనమిచ్చారు. త‌రువాత గోపూజ, గోకులాష్ట‌మి ఆస్థానం జ‌రిగింది.

ఆగస్టు 31న స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో …..

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ కృష్ణస్వామి ఉత్స‌మూలవర్లకు తిరుమంజ‌నం, పురాణ ప‌ఠ‌ణం, ఆస్థానం నిర్వహించారు.

నారాయణవనంలో….

నారాయ‌ణ‌వ‌నం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం, శుద్ది నిర్వహించారు. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానం చేశారు.

ఆగష్టు 31వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం నిర్వ‌హిస్తారు. ఉద‌యం 8.30 నుండి 9.30 శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం, ఆల‌యంలో తిరుచ్చి ఉత్స‌వం, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆల‌యంలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.

నాగలాపురంలో….

నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, శుద్ది నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారికి అభిషేకం, అనంతరం గోకులాష్టమి ఆస్థానంనిర్వ‌హించారు.

ఆగస్టు 31వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం జ‌రుపుతారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆల‌యంలో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు.

కార్వేటినగరంలో…..

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు, ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వ‌హించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు.

ఆగస్టు 31వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుండి 7.30 గంటల వరకు గో పూజ మహోత్సవం, ఉట్లోత్సవం, ఆల‌యంలో నిర్వహించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.