ALL ARJITA SEVAS FOR SRIVARI UTSAVA IDOLS TEMPORARILY SUSPENDED IN TIRUMAL TEMPLE _ శ్రీ‌వారి ఉత్స‌వ‌మూర్తుల‌కు నిర్వ‌హించే ఆర్జిత‌సేవ‌లు తాత్కాలికంగా నిలుపుద‌ల‌

శ్రీ‌వారి ఉత్స‌వ‌మూర్తుల‌కు నిర్వ‌హించే ఆర్జిత‌సేవ‌లు తాత్కాలికంగా నిలుపుద‌ల‌

తిరుమల, 2020 మార్చి 18: క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భాగంగా శ్రీ‌వారి భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఉత్స‌వ‌మూర్తుల‌కు నిర్వ‌హించే అన్నిర‌కాల‌ ఆర్జిత సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేయ‌డ‌మైన‌ది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోర‌డ‌మైన‌ది.

నిలుపుద‌ల చేసిన వాటిలో విశేష‌పూజ‌, వ‌సంతోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, డోలోత్స‌వం, స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం, క‌ల్యాణోత్సవం, స‌హ‌స్రదీపాలంకార‌సేవ ఉన్నాయి. క‌ల్యాణోత్స‌వాన్ని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

కాగా, ఆర్జిత సేవా టికెట్లు గ‌ల భ‌క్తులు త‌మ తిరుమ‌ల ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకోవ‌డం లేదా వాయిదా వేసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా వారిని విఐపి బ్రేక్‌లో అనుమ‌తించ‌డం జ‌రుగుతుంది. విఐపి బ్రేక్‌లో ద‌ర్శనానికి వెళ్లేందుకు స‌మ్మ‌తం లేని భ‌క్తుల‌కు సంబంధిత ఆర్జిత సేవా టికెట్ల ధ‌ర‌ను రీఫండ్ చేస్తారు.

అదేవిధంగా, శుక్ర‌వారం నుండి అంగ‌ప్ర‌ద‌క్షిణ టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 18 Mar. 20: As a part of preventing the spread of Covid 19 – Corona Virus, TTD has temporarily suspended all the Arjita sevas conducted to the Srivari Utsava idols with immediate effect.

TTD appealed to the devotees to take note that the suspended sevas included arjita Brahmotsavam, Dolotsavam, Sahasra Kalasabhisekam, Kalyanotsavam, and Sahasra Deepalankara seva. Arjitha Kalyanotsavam will be performed in Ekantham only.

All devotees with arjita seva tickets need not cancel their journey tickets, but could get darshan under VIP break category. Those who do not want to enjoy the VIP break darshan can opt for refund as well.

TTD has also suspended Anga Pradakshina, Senior Citizens, Physically Handicapped and parents with infant’s darshan, which will come into effect from Friday, March 20 onwards.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI