శ్రీ కోదండరామాలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం

తిరుపతి, ఏప్రిల్‌  11, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత రాములవారికి స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.
సాయంత్రం అర్చకులు విమాన ప్రదక్షిణగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణమండపంలో ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా పురాణ పండితులు పంచాంగ శ్రవణం చేశారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ఆంజనేయులు, శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.