CHANDRAGIRI MLA PRESENTS SAREE TO SKVST _ శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి సారె స‌మ‌ర్పించిన చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి

Tirupati, 6 Mar. 21: TTD board Ex-officio member and Chandragiri MLA Sri Chevireddy Bhaskar Reddy on Saturday presented pattu Saree as part of his offering to Sri Kalyana Venkateswara Swamy during ongoing Brahmotsavams.

Earlier the holy pattu saree was offered special pujas at the Tummalagunta Sri Venkateswara temple and later brought to Srinivasa Mangapuram amidst Mangala vadyam.

Temple AEO Sri Dhananjayudu superintendent Sri Ramanaiah, Inspector Sri Srinivasulu were present.

4 UMBRELLAS PRESENTED

Four umbrellas were presented for adorning the Garuda vahana by Sri Dinesh Kumar, Vice Chairman and trustee Sri Saravanan of the Srimad Ramanuja Kaikarya Trust of Tiruninravuru of Tamilnadu.

The umbrellas were bring presented since last 16 years and were handed over to the DyEO Smt Shanti.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి సారె స‌మ‌ర్పించిన చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి
 
తిరుపతి, 2021 మార్చి 06: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి శ‌నివారం మ‌ధ్యాహ్నం టిటిడి బోర్డు స‌భ్యులు, చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి సారె సమర్పించారు. ముందుగా తిరుప‌తి స‌మీపంలోని తుమ్మ‌ల‌గుంట శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆ తరువాత శేషవస్త్రాలు, పసుపు కుంకుమ తదితర మంగళద్రవ్యాలతో కూడిన సారెను  మేళతాళాల మధ్య ఊరేగింపుగా శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయానికి తీసుకెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పించారు.
 
ఈ సందర్భంగా డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ  శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి 
బ్ర‌హ్మోత్స‌వాలలో భాగంగా గ‌రుడ‌సేవ‌నాడు ప్రతి ఏటా స్వామివారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా శ‌నివారం స్వామివారికి సారె స‌మ‌ర్పించిన‌ట్లు తెలిపారు.
 
ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.
 
ఈ కార్యక్రమంలో  ఆలయ ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మ‌ణ‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.
 
4 గొడుగులు విరాళం
 
తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు వైస్ ఛైర్మన్ శ్రీ దినేష్ కుమార్, ట్రస్టీ శ్రీ శరవణ కలిసి 4 గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతికి అందించారు. వీరు 16 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం రోజు గొడుగులు అందిస్తున్నారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.