TTD CHAIRMAN CONDOLES THE DEMISE OF PEJAVAR MUTT SEER _ శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ ఆధ్యాత్మిక సేవలు అమోఘం టీటీడీ చైర్మన్‌ శ్రీ వైవీ సుబ్బారెడ్డి సంతాపం

Tirumala, 29 Dec. 19: TTD Chairman Sri YV Subba Reddy condoled the sad demise of Pejawar mutt pontiff Sri Sri Sri Visweswa Thirtha on Sunday and said his services towards Hindu Sanatana Dharma and contribution to the society were unparalleled.

The 88-year old pontiff ailing due to pneumonia was undergoing treatment at Manipal hospital since December 20, breathed his last on Sunday.

The Chairman said the pontiff heading the premiere mutt, one among the eight mutts in Karnataka, had championed the cause of propagation of Hindu Sanatana dharma and guided lakhs of devotees in this noble mission. The pontiff had also promoted education by setting up hostels and educational institutions across Karnataka state.

TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy also expressed their condolences over the demise of the Pontiff.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

 

శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ ఆధ్యాత్మిక సేవలు అమోఘం టీటీడీ చైర్మన్‌ శ్రీ వైవీ సుబ్బారెడ్డి సంతాపం
 
డిసెంబరు 2019, తిరుమ‌ల 29: ఉడిపి పెజావర్‌ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ ఆధ్యాత్మిక ప్రపంచానికి చేసిన సేవలు అమోఘమని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. స్వామీజీ పరమపదించడం బాధాకరమని ఆదివారం ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. 
 
న్యూమోనియాతో అస్వస్థతకు గురైన 88 ఏళ్ల స్వామీజీకి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో 20వ తేదీ నుంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. శ్వాస అందడం కష్టమై ఆదివారం ఉదయం భగవదైక్యం చెందారు. కర్నాటకలోని ఎనిమిది గొప్ప మఠాల్లో ఒకటైన ఉడిపి పెజావర్‌ పీఠం నుంచి లక్షలాదిమంది భక్తులకు దిశానిర్దేశం చేసే స్వామీజీ పరమపదించడం ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటని శ్రీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అఖిల భారత మాధ్య మహా మండల స్థాపన ద్వారా కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో పేద విద్యార్థుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి స్వామీజీ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. గోసంరక్షణ కోసం స్వామీజీ చేసిన సేవలు ఆమోఘమన్నారు. కర్ణాటక మొత్తం రాష్ట్ర స్వామీజీగా, గొప్ప సంఘ సంస్కర్తగా పేరుగాంచిన విశ్వేశతీర్థ స్వామీజీ  మనల్ని విడిచివెళ్లడం బాధాకరమన్నారు. స్వామీజీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
 
స్వామీజీ భగవదైక్యం చెందడంపై టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.