TTD TO DIGITIZE VETURI’S LITERATURE _ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి స్ఫూర్తితో పరిశోధనలు సాగించాలి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tirupati, 3 Dec. 19: TTD JEO Sri Basanth Kumar has met Sri Veturi Ananda Murthy, the son of renowned reasearcher, writer and the man who is behind bringing Annamacharya Sankeertans to lime light, late Sriman Veturi Pabhakar Sastry at his residence at bangalore on Tuesday.

They discussed on how to bring all the great works of Sri Sastry for the next generation and also to digitalization them.

These works will be carried out as a part of Research and development of Veturi Prabhakara Shastry Sahithya Peetam with the collobaration with TTD and SV Vedic varsity. 

Estates Officer Sri Vijayasaradhi was also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

 

 

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి స్ఫూర్తితో పరిశోధనలు సాగించాలి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

తిరుపతి, 2019 డిసెంబ‌రు 03: శ్రీమాన్‌ వేటూరి ప్రభాకరశాస్త్రి స్ఫూర్తితో తెలుగు భాష, సాహిత్యంపై విస్తృతంగా పరిశోధనలు సాగించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ కోరారు. శ్రీమాన్ వేటూరి ప్రభాకర‌ శాస్త్రి గారి కుమారుడు శ్రీ ఆనందమూర్తిని బెంగళూరులోని తన నివాసంలో మంగ‌ళ‌వారం ఉద‌యం జెఈవో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి మరియు ఎస్.వి. వేదిక్ యూనివర్సిటీల సహకారంతో వేటూరి ప్రభాకర శాస్త్రిగారి ర‌చ‌న‌ల‌పై పరిశోధనలు  చేయాల‌న్నారు. శ్రీ వేటూరి ప్రభాకర‌ శాస్త్రి యొక్క ర‌చ‌న‌లు, ప‌రిశోధ‌న‌ల‌ను సంరక్షించి రాబోవు త‌రాల‌కు అందించేందుకు డిజిటలైజేషన్ చేయ‌డంపై చ‌ర్చించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.