MAHA SAMPROKSHANA FETE CONCLUDES AT KARVETINAGARAM TEMPLE _ శ్రీ వేణుగోపాల‌స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన మహాసంప్రోక్షణ

Tirupati, 27 August 2021: The five day long Astabandhana Jeernodharana Maha samprokshana at Sri Venugopal Swami temple at Karvetinagaram that was held in Ekantham as per covid guidelines concluded on Friday.

On the final day morning, Homams and Purnahuti rituals were performed followed by Kumbha Archana and Maha Samprokshana festivities observed for utsava idols of Sri Venugopal Swami and His galaxy of deities. Sarva Darshan for devotees commenced after 10.30 am.

Later in the evening, Kalyanotsavam was performed for Swami and His consorts followed by procession within temple premises.

Special grade DyEO Smt Parvati, Agama Advisor Sri Vedanta Vishnu Bhattacharya, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh, Temple Inspector Sri Kumar and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ వేణుగోపాల‌స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన మహాసంప్రోక్షణ

తిరుపతి, 2021 ఆగ‌స్టు 27: కార్వేటిన‌గ‌రం శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధ‌రణ మహాసంప్రోక్షణ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం ఉద‌యం శాస్త్రోక్తంగా ముగిసింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఆలయంలో ఐదు రోజుల పాటు అష్టబంధన జీర్ణోద్ధ‌రణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. చివ‌రి రోజైన శుక్ర‌వారం ఉద‌యం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు హోమాలు, ఉద‌యం 7.30 గంట‌ల‌కు మ‌హా పూర్ణాహూతి నిర్వ‌హించారు. ఉద‌యం 8 నుండి 8.20 గంట‌ల మ‌ధ్య క‌న్యాల‌గ్నంలో శ్రీ వేణుగోపాల‌ స్వామి, ప‌రివార దేవ‌త‌ల‌కు కుంభార్చన, మ‌హా సంప్రోక్ష‌ణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జ‌రిగాయి. ఉద‌యం 10.30 గంట‌ల నుండి భక్తులను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు.

సాయంత్రం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు క‌ల్యాణోత్స‌వం, రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఊరేగింపు నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్య‌, ఏఈవోశ్రీ దుర్గ‌రాజు, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కుమార్, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.