MUSIC IS A SOFTWARE TO PROMOTE WORLD PEACE- KANCHI PONTIFF _ సంగీతం ప్రపంచానికి శాంతిని ఇచ్చే సాఫ్ట్వేర్

–       NATION-BUILDING IS POSSIBLE ONLY THROUGH THE PRESERVATION OF OUR CULTURE

 

Tirupati, 05 January 2022: The preservation of cultural ethos of India will alone promote nation-building activities and thereby lead to the scientific and economic growth of the country and said Music is a software to promote world peace said the Pontiff of Kanchi Kamakoti Peetham HH Sri Sri Sri Sankara Vijayendra Saraswati Swamy.

 

In his blessing address at the SV College of Music and Dance in Tirupati on Wednesday evening, the Kanchi seer expounded the need for more research in the realm of Indian classical music.

 

The seer said that he was happy to visit the college for the second time after 1993 and espoused the need to spread the Bharathiya culture stream through out the country through music and other traditional fine arts.

 

He said the Kanchi Peetham plans to take up the cultural propaganda campaign from Kashi and lauded TTD for its efforts to preserve and propagate Music, Literature and Sanatana Hindu Dharma.

 

TTD JEO Smt Sada Bhargavi (Education & Health), Chief Audit officer Sri Sesha Shailendra, DEO Sri Govindarajan, Annamacharya Project Director Dr A Vibhishana Sharma, College Principal Sri Sudhakar and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సంగీతం ప్రపంచానికి శాంతిని ఇచ్చే సాఫ్ట్వేర్

 –   భారతీయ సంస్కృతిని పరిరక్షిస్తేనే దేశ పునర్నిర్మాణం సాధ్యం

 –  ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్హులకు కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అనుగ్రహ బాషణం

తిరుపతి 0జనవరి 2022;సంగీతం ప్రపంచానికి శాంతిని ప్రసాదించే సాఫ్ట్వేర్ అని కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. భారతీయ సంస్కృతి ని పరిరక్షిస్తేనే దేశ పునర్నిర్మాణం సాధ్యమవుతుందనీ, తద్వారా విజ్ఞాన, ఆర్థిక అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. భారతీయ సంగీతం పై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీటీడీ శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలను శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి బుధవారం రాత్రి సందర్శించారు.  ఈ సందర్భంగా  స్వామి వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కళాశాల ఆవరణలోని శ్రీ వినాయక స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కంచి స్వామి దర్శించుకున్నారు. కళాశాల విద్యార్థులు సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.

అనంతరం స్వామి వారు అనుగ్రహబాషణం చేశారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాలతో కంచిపీఠానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. 1993 తరువాత మరోసారి కళాశాలను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.  భారతీయ సంస్కృతి అమృత ఝరి అని దీన్ని గ్రామీణ ప్రాంతాల వరకు మరోసారి తీసుకుని వెళ్ళడానికి దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాశి నుంచి ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించడానికి కంచిపీఠం ప్రయత్నం చేస్తోందని స్వామి చెప్పారు.  స్వార్థం లేని త్రికాల జ్ఞానం కలిగిన శాస్త్రం సంగీత శాస్త్రమని ఆయన చెప్పారు. సంగీతం మనిషి మనసులో కాలుష్యాన్ని తొలగించి ఆత్మ విశ్వాసం పెంచుతుందన్నారు.

టీటీడీ సంగీత, సాహిత్యం, భారతీయ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఎంత గానో కృషి చేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జెఈవో (విద్య మరియు వైద్యం) శ్రీమతి సదా భార్గవి, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర,  విద్యా విభాగం డిప్యూటి ఈవో శ్రీ గోవింద రాజన్, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ విభీషణ శర్మ, కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సుధాకర్ తో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది