CONTINUOUS PROPAGATION AND PROTECTION OF SANATANA DHARMA- TTD EO _ సనాతన ధర్మ ప‌రిర‌క్ష‌ణ‌, ధ‌ర్మ‌ప్ర‌చారం విస్తృతం చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirupati, 9 Jan. 20: TTD Executive Officer Sri Anil Kumar Singhal today urged the Hindu dharma prachara parishad, HDPP, to coordinate efforts with Samarasata Seva foundation in the task of Santana dharma protection and propagation.

Addressing a coordination meeting of HDPP and SS seva foundation at the TTDs administrative building on Thursday evening the TTD EO said the HDPP should approach the TTD board for approval for construction of 500 temples in the SC, ST and fishermen colonies of both Telugu states.

He asked officials to take steps for supply of Mike sets, umbrellas and bhajan materials to all temples built by TTD and state endowment department along with other materials like hand bills, kankanas, pustaka pradadam, besides cards Srivari portraits and bhagavat gita volumes.

He said the training program in puja vidhanam for SC, ST and other youth held at SVETA should be continued. He said TTD could conduct Srinivas Kalyanam at all 500 temples after completion.

The EO said soon TTD would commence training programs in performing Namakaranam, Anna prasam, etc for archakas from rural areas, He also said TTD could supply dharmic material to Bala Vikas kendras in the state.

TTD JEO if Tirupati Sri P Basant Kumar, CE Sri Ramachandra Reddy, HDPP OSD Acharya Rajagopalan, Samara Sata Seva foundation President Sri Dasari Srinivasulu, representatives Sri Vishnu. Sri Srinath and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

సనాతన ధర్మ ప‌రిర‌క్ష‌ణ‌, ధ‌ర్మ‌ప్ర‌చారం విస్తృతం చేయాలి  : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుపతి, 2020 జ‌న‌వ‌రి 09: సనాతన ధర్మ ప‌రిర‌క్ష‌ణ‌, ధ‌ర్మప్ర‌చారాన్ని టిటిడి హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్‌, స‌మ‌ర‌స‌త సేవా ఫౌడేష‌న్ స‌హాకారంతో మ‌రింత విస్తృతం చేయాల‌ని టిటిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఉద్ఘాటించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో ఈవో కార్యాల‌యంలో ఆయ‌న టిటిడి అధికారులు, స‌మ‌ర‌స‌త సేవా ఫౌడేష‌న్ ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.  

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ  రెండు తెలుగు రాష్ట్రాల్లోని యసి, యస్టీ, మ‌త్స‌కార కాల‌నీల‌లో 500 ఆల‌యాల నిర్మాణానికి అనుమ‌తి కోరుతూహెచ్‌డిపిపి కార్య‌నిర్వ‌హ‌క మండ‌లికి నివేదించాల‌న్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల‌లో టిటిడి, దేవాదాయ శాఖ సంయుక్తంగా నిర్మించిన ఆల‌యాల‌కు మైక్‌సెట్లు, గొడుగులు, భ‌జ‌న సామ‌గ్రి వేంట‌నే అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అదేవిధంగా ఆల‌యాల‌కు ధ‌ర్మ‌ప్ర‌చార సామ‌గ్రి, క‌ర‌ప‌త్రాలు, కంక‌ణాలు, పుస్త‌క ప్ర‌సాదం, శ్రీ‌వారి చిత్రాల‌తో కూడిన కార్డులు, భ‌గ‌వ‌ద్గీత పుస్త‌కాలు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా తిరుప‌తిలోని శ్వేతా భ‌వ‌నంలో యసి, యస్టీ, బిసిల‌కు పూజ విధానంపై శిక్ష‌ణ త‌ర‌గ‌తులు కొన‌సాగించ‌ల‌న్నారు. నిర్వ‌హించాల‌న్నారు.  రెండు తెలుగు రాష్ట్రాల‌లో 500 ఆల‌యాల నిర్మాణం పూర్త‌యిన వేంట‌నే టిటిడి ఆధ్వ‌ర్యంలో శ్రీ‌నివాస క‌ల్యాణాలు నిర్వ‌హించాల‌న్నారు. మ‌న‌గుడి కార్య‌క్ర‌మాన్ని మ‌రో 500 దేవాల‌యాల‌కు విస్త‌రించాల‌న్నారు. గ్రామీణ ప్రాంతాల‌లో అర్చ‌కుల‌కు పౌరోహిత్యంకు సంబంధించిన నామ‌క‌ర‌ణం, అన్న‌ప్రాసం, మొద‌ల‌గు విష‌యాల‌లో శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. టిటిడి స‌హాకారంతో బాల వికాస కేంద్రాల‌కు పుస్త‌కాల‌ను అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శిని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సిఇ శ్రీ రామ‌చంద్రారెడ్డి, డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్, స‌మ‌ర‌స‌త సేవా ఫౌడేష‌న్ అధ్య‌క్షులు శ్రీ దాస‌రి శ్రీ‌నివాసులు, ప్ర‌తినిధులు శ్రీ విష్ణు, శ్రీ శ్రీ‌నాధ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.