TTD TOP BRASS VISITS STATUE OF EQUALITY _ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న టీటీడీ చైర్మన్,ఈవో, అదనపు ఈవో -ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుపై ఆనందం

Tirumala, 06 February 2022: TTD Chairman Sri YV Subba Reddy along with EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy on Sunday visited the gigantic and majestic statue of equality (Sri Ramanuja Charya) installed by Sri Sri Sri Tridandi Chinna Jeeyarswami at Mutchintal in the state of Telangana and had darshan.

They also visited the Yagashala and Pravachanam Mandapam and were blessed by the Tridandi Pontiff.

As a part of their visit, they also went around the TTD photo exhibition bay, which was conceptualized with TTD Naidu… Nedu and expressed pleasure at the display of photos.

The exhibition heralding the significance of the Srivari temple and its socio-economic activities has been appreciated by scores of devotees visiting the Statue of equality.

The unique TTD products like floral agarbattis, dry flower technology products like portraits of gods, key chains, paperweights etc. are put for display.

The Chandragiri MLA who is one of the members of the Statue program committee Dr Chevireddy Bhaskar Reddy, Program Officer of HDPP Sri Vijay Saradhi, Secunderabad Oriental College Principal Sri Hemant Kumar, HDPP official Smt Vijayalakshmi were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్న టీటీడీ చైర్మన్,ఈవో, అదనపు ఈవో
– ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటుపై ఆనందం

తిరుమల 6 జనవరి 2022: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్మించిన సమత మూర్తి శ్రీ రామానుజ విగ్రహాన్ని ఆదివారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి దర్శించుకున్నారు.
యాగశాల ను దర్శించుకున్న అనంతరం, ప్రవచన మండపంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఇక్కడ నాడు నేడు తిరుమల అనే కాన్సెప్టుతో టీటీడీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న తిరుమల ఆలయం, ఆలయంలోని విశిష్టతలు, ఆలయాన్ని దర్శించుకున్న వి ఐ పిలు, స్థానిక ఆలయాలు, టీటీడీ సామాజిక సేవ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన చిత్రాలను వేలాదిమంది భక్తులు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ తయారు చేస్తున్న పరిమళ భరిత అగర బత్తీలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన దేవతా మూర్తుల చిత్రపటాల విక్రయాలను వీరు పరిశీలించారు.

చంద్రగిరి శాసన సభ్యులు, సమతా మూర్తి శ్రీ రామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమాల కమిటీ సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరితో పాటు ఉన్నారు. హిందూధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్టుల కార్యక్రమాల అధికారి శ్రీ విజయ సారథి, సికింద్రాబాద్ ఓరియంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ హేమంత్ కుమార్, హిందూధర్మ ప్రచార పరిషత్ ప్రాజెక్టు అధికారిణి శ్రీమతి విజయలక్ష్మి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది