SARVABHOOPALA VAHANA AT KRT _ సర్వభూపాల వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అభ‌యం

Tirupati, 20 Mar. 21: On the penultimate day of the on-going annual Brahmotsavam at Sri Kodandarama Swamy temple, Sri Ramachandra chose to bless devotees on Sarva Bhoopala vahana instead of Rathotsavam on Saturday morning.

The Sarva Bhupala vahana indicated the glory of Sri Ramachandra as a king of kings and Supremo of an entire galaxy. TTD organised Snapana Tirumanjanam for utsava idols after Vahana Seva. 

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, Special grade DyEO Smt Parvati, AEO Sri Durgaraju and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

సర్వభూపాల వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అభ‌యం

తిరుపతి, 2021 మార్చి 20: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శ‌ని‌వారం ఉదయం ర‌థోత్స‌వం బ‌దులు సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు

సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్‌” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు.

వాహన సేవ అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్ళతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. రాత్రి 8.00 నుండి 9 గంటల వరకు అశ్వ‌ వాహనసేవ జరగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.