GITA GANA CONTESTS FOR DHARMIC PROPAGATION _ స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారం కోసం గీతాగాన య‌జ్ఞం పోటీలు

  • ACTION PLAN FOR SRI VENKATESWARA VARTAM CONCEIVED- TTD EO

Tirupati, 04 October 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy has said that TTD proposed to conduct Gita Gyan contests with chanting of all 700 shlokas from Sri Bhagavad-Gita as part of its agenda for Hindu Sanatana Dharma propagation.

 

Addressing the review meeting with senior officials at the Conference Hall at TTD Administrative Building on Monday the TTD EO directed officials to conceive an action plan in consultation with Archakas on conducting Sri Venkateswara Vratam for benefit of devotees across the globe. 

 

Among others he asked them to prepare books for penning Sri Venkateswaranama Koti etc., electrical decorations at the airport, Alipiri and railway stations to attract devotees, increase production of agarbattis to meet demand, coordinate all 516 Goshala and Gosamrakshana shalas in Telugu states.

 

TTD EO also directed officials to begin production of dry flower technology-aided products like divine portraits etc., set up a committee for the purchase of desi Gir cows for touring North India, prepare health profile of all TTD employees with annual health check-ups and issue new ID cards to all TTD employees from October 15 onwards.

 

TTD Additional EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmaiah, CVSO Sri Gopinath Jatti and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారం కోసం గీతాగాన య‌జ్ఞం పోటీలు

– శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వ్ర‌త విధానం రూప‌క‌ల్ప‌న‌

– టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 04: సనాత‌న ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా భ‌గ‌వ‌ద్గీత‌లోని 700 శ్లోకాల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లో గీతాగాన య‌జ్ఞం పేరిట శ్లోక ప‌ఠ‌న పోటీలు నిర్వ‌హిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి పరిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ శ్రీ‌వారి భ‌క్తుల కోసం అర్చ‌క‌స్వాముల సాయంతో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వ్ర‌త విధానానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. శ్రీ‌వారి వైభ‌వాన్ని వ్యాప్తి చేసేందుకు భ‌క్తుల‌తో శ్రీ వేంక‌టేశ్వ‌ర నామ‌కోటి రాయించాల‌ని, ఇందుకోసం పుస్త‌కాలు సిద్ధం చేసుకోవ‌డం, వాటిని భ‌ద్ర‌ప‌ర‌చ‌డం త‌దిత‌ర అంశాల‌తో విధి విధానాలు రూపొందించాల‌ని సూచించారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుప‌తిలో భ‌క్తులు సంచ‌రించే అలిపిరి, ఎయిర్ పోర్టు, రైల్వేస్టేష‌న్ త‌దిత‌ర ప్రాంతాల్లో విద్యుత్ అలంక‌ర‌ణ‌లు పెంచాల‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో గ‌ల 516 గోశాల‌ల‌ను టిటిడి గోసంర‌క్ష‌ణ‌శాల‌కు అనుసంధానం చేసి త్వ‌ర‌లో వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించాల‌న్నారు. టిటిడి త‌యారు చేస్తున్న అగ‌ర‌బ‌త్తుల‌కు భ‌క్తుల నుండి డిమాండ్ ఉంద‌ని, ఉత్ప‌త్తి మ‌రింత పెంచాల‌ని గోశాల అధికారుల‌ను ఆదేశించారు. డాక్ట‌ర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ‌విద్యాల‌యం స‌హ‌కారంతో డ్రైఫ్ల‌వ‌ర్ టెక్నాల‌జీ ద్వారా స్వామి, అమ్మ‌వార్ల ఫొటోలు, క్యాలెండర్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు తదితరాలు త్వ‌రిత‌గ‌తిన త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు.

దేశీయ గోవుల కొనుగోలు కోసం ఒక క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని, క‌మిటీ స‌భ్యులు ఉత్త‌ర భార‌త‌దేశంలో ప‌ర్య‌టించి గోవుల‌ను కొనుగోలు చేయాల‌ని ఈవో ఆదేశించారు. ఉద్యోగుల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాల‌ని వైద్య విభాగం అధికారుల‌కు సూచించారు. ఈ నెల 15వ తేదీ నాటికి టిటిడి ఉద్యోగులంద‌రికీ నూత‌న గుర్తింపు కార్డులు మంజూరుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మ‌య్య‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.