హ‌నుమ‌జ్జ‌యంతి నాడు ఆక‌ట్టుకున్న భ‌క్తి సంగీత కార్యక్రమాలు 

హ‌నుమ‌జ్జ‌యంతి నాడు ఆక‌ట్టుకున్న భ‌క్తి సంగీత కార్యక్రమాలు

తిరుమల, 2023 మే 14: హ‌నుమ‌జ్జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆదివారం తిరుమ‌ల‌లోని ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విషేషంగా ఆక‌ట్టుకున్నాయి.

ఆకాశ‌గంగలోని శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల వ‌ర‌కు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు శ్రీ‌రామ నామ సంకీర్త‌న‌లు ఆల‌పించారు. అనంతరం చిన్నారులు హనుమాన్ చాలీసా జపించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు దాససాహిత్య వాగ్గేయకారులు హనుమత్ సంకీర్తనలు గానం చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులు ఆంజ‌నేయ‌స్వామివారి అవిర్భంపై హ‌రిక‌థ పారాయ‌ణం చేయనున్నారు.

జాపాలి క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వ‌ర్యంలో క‌ళాకారులు ఉద‌యం 8.30 నుంచి 10.30 గంటల వరకు హనుమాన్ చాలీసా ప‌ఠించారు. ఉదయం 10.30 నుండి 11.30 ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల అధ్యాప‌కురాలు డా.వంద‌న ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు ” శ్రీ హనుమాన్ జయ హనుమాన్…, శ్రీ ఆంజనేయ జగదేకవీర….., బంటు రీతి కొలువు…. తదితర కీర్తనలను సుమధురంగా ఆలపించారు. ఉదయం
11.45 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చిన్నారులు ” బాల ఆంజనేయ విజయం” నృత్య రూపకం ప్రదర్శించారు.

అనంతరం మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ప‌లు భ‌క్తి సంకీర్త‌న‌లు ఆలపించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.