MAHA SAMPROKSHANAM HELD _ ఆగమోక్తంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ

TIRUPATI, 14 MAY 2023: The Maha Samprokshanam ritual was observed with religious fervour in the ancient shrine of Sri Lakshmi Narayana temple located inside Sri Kapileswara Swamy temple premises in Tirupati on Sunday.

The religious event was observed between 9am and 10am in the auspicious Mithuna Lagnam.

One of the chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, Kankanabhattar Sri Suryakumara Acharyulu, Deputy EO Sri Devendrababu and other staff were also present.

Later the devotees were allowed for darshan.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  
ఆగమోక్తంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ
 
– భక్తులకు దర్శనం ప్రారంభం
 
తిరుపతి 14 మే 2023: తిరుపతి కపిలతీర్థంలో గల పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ ఆదివారం ఆగమోక్తంగా జరిగింది.
 
ఇందులో భాగంగా ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి కళావాహన, మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభించారు.
 
 ఈ కార్యక్రమంలో టీటీడీ  బోర్డు  సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ దంపతులు,తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, కంకణభట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి,  టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రవికుమార్ పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.