JEO (M AND H) TAKES PART IN VALEDICTORY SESSION OF THE TRAINING PROGRAM _ హిందూధార్మిక ప్రచారానికి ఇదో వాహకం – శిక్షణా తరగతుల ముగింపు సభలో జెఈవో శ్రీమతి సదా భార్గవి

Tirupati, 30 Sep. 21: Addressing the valedictory session of the three-day training program for women, TTD JEO (M and H) Smt Sada Bhargavi said the task of preparing divine portraits from used flowers of TTD temples also enables to take forward the Hindu Sanatana Dharma.

 
The JEO said the divine portrait will adorn the homes of all devotees and these portraits will be presented to winners during Women’s Day and similar other functions by TTD.

 

The YSR horticultural University vice-chancellor Dr Janakiraman who spoke from the virtual platform said the women have undergone the training in the Dry Flower Technology with utmost dedication and devotion. “Even the challenged persons shall be trained in dry flower technology in the future”, he added.

 

Horticultural university extension Director Sri Srinivasulu, scientists D Nagraj, Dr Karuna and TTD DyEO Sri Ramana Prasad were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హిందూధార్మిక ప్రచారానికి ఇదో వాహకం
– శిక్షణా తరగతుల ముగింపు సభలో జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 30 సెప్టెంబరు 2021: టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవుళ్ళ చిత్ర పటాలను తయారు చేయడం హిందూధర్మ ప్రచారానికి ఇదో వాహకం అవుతుందని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు.

పేరూరు సమీపంలోని చీని, నిమ్మ పరిశోధన కేంద్రం లో మూడురోజుల పాటు.మహిళలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభకు

జెఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవుళ్ళ చిత్రపటాలు తయారు చేయడం ద్వారా, ప్రతి ఇంటికి స్వామివారిని పంపుతున్నామని చెప్పారు. మహిళలు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు.రాబోయే రోజుల్లో టీటీడీ నిర్వహించే మహిళా దినోత్సవ కార్యక్రమం, అవార్డుల ప్రదానం కార్యక్రమాల్లో ఈ ప్రతిమలు ఇస్తామని ఆమె చెప్పారు. శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా జెఈవో అభినందనలు తెలిపారు.

డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ జానకిరామ్ వర్చువల్ గా ప్రసంగించారు. టీటీడీ తో చేసుకున్న ఈ ఒప్పందం ఎంతో గొప్పదని చెప్పారు. శిక్షణ తీసుకున్న మహిళల్లో భక్తి, శక్తి కనిపించాయన్నారు. టీటీడీ అగరబత్తులు స్వామివారి ప్రసాదంగా ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలన్నారు. చిత్ర పటాల తయారీలో రాబోయే రోజుల్లో వికలాంగులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.

ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసులు, శాస్త్రవేత్తలు డాక్టర్ నాగరాజు, డాక్టర్ కరుణ శ్రీ, టీటీడీ డిప్యూటి ఈవో శ్రీ రమణ ప్రసాద్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది