BLESSED TO SERVE SRIVARI- DyEO (WELFARE) SRI ANANDA RAJU _ శ్రీ‌వారి స‌న్నిధిలో ఉద్యోగం పూర్వ‌జ‌న్మ సుకృతం – సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజు

శ్రీ‌వారి స‌న్నిధిలో ఉద్యోగం పూర్వ‌జ‌న్మ సుకృతం – సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజు

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 30: మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో శ్రీ‌వారి స‌న్నిధిలో సుదీర్ఘ కాలం ప‌ని చేయ‌డం పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజు అన్నారు. టిటిడిలోని వివిద‌ విభాగాల్లో పని చేస్తూ గురువారం ఉద్యోగ విరమణ చేసిన 11 మందికి పరిపాలన భవనం ఆవరణంలోని సమావేశం హాలులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పని చేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ విరమణ చేసిన వారంతా శేష జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా గడిచేలా శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆశీస్సులు అందించాల‌న్నారు. ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగుల‌కు ఇంత‌టి గౌర‌వ స‌న్మాన కార్య‌క్ర‌మం నిరంత‌రం కొన‌సాగించేలా చ‌ర్య‌లు తీసుకున్న‌టిటిడి ఛైర్మ‌న్, ఈవో, అద‌న‌పు ఈవోల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అనంత‌రం వీరందరికీ శాలువాలు కప్పి సన్మానించారు. త‌రువాత‌ వీరందరికీ కుటుంబసభ్యులతో సహా అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో (హెచ్ఆర్‌) శ్రీ గోవింద‌రాజ‌న్‌తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ చేసింది …..

శ్రీ డి.ల‌క్ష్మ‌య్య ( ఏఈవో), శ్రీ పి.గోపినాథ్ ( ఏఈవో), శ్రీ సి.మ‌ణి ( లెక్చ‌ర‌ర్‌), శ్రీ పి.గోపినాథ్‌ ( అసిస్టెంట్ షరాబ్), శ్రీ కె.మున‌స్వామినాయుడు (అసిస్టెంట్ షరాబ్ ), శ్రీ టి.శివ‌ప్ర‌సాద్‌ ( అసిస్టెంట్ షరాబ్), శ్రీ ఆర్‌.గంగ‌య్య‌ ( దఫెదార్), శ్రీ ఎ.వెంక‌టేశం (ట‌న్స్‌ర‌ర్ మేస్త్రీ ), శ్రీ టి.నాగేశ్వ‌ర‌రావు ( ట‌న్స్‌ర‌ర్ మేస్త్రీ ) శ్రీమ‌తి ఎన్‌.ప‌ద్మావ‌త‌మ్మ ( ఫిట్ట‌ర్‌), శ్రీమ‌తి పి.ల‌క్ష్మీ (ఎమ్‌పిడ‌బ్లూ).

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది

Tirupati, 30 Sep. 21: The TTD DyEO (welfare) Sri Ananda Raju said on Thursday that it was a blessing of the past to serve in the Srivari temple and fulfill the divine motto that Serving devotees was a serving to God.

 

A felicitation event was held at the TTD Administrative building on Thursday to honour the eleven TTD employees who discharged their duties for over three decades in various TTD departments in different payrolls and laid down office on Thursday.

 

Speaking on the occasion he congratulated all the retiring employees a long and healthy life with the blessings of Sri Venkateswara.

 

Thereafter he felicitated them with shawls and Veda Ashirvachanam by TTD Vedic pundits.

 

DyEO (HR) Sri Govindarajan and other officials participated in the event.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI