TTD CHAIRMAN REVIEWS HDPP ACTIVITIES _ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్యక్ర‌మాల‌పై టిటిడి ఛైర్మ‌న్ స‌మీక్ష‌

Tirumala, 7 Nov. 20: TTD Chairman Sri Y V Subba Reddy along with EO Dr KS Jawahar Reddy reviewed the activities of Hindu Dharma Pracharam Parishad (HDPP) of TTD at Annamaiah Bhavan in Tirumala on Friday and instructed the concerned to chalk out an action plan to take Sanatana Hindu Dharma Pracharam from grass root level to the village level in a better manner.

HIGHLIGHTS OF THE MEETING:

  • Karthika Deepa Neerajanam to Sri Malayappa Swamy along four mada streets on the auspicious day of Karthika Pournami Deepotsavam at Tirumala 

 

  • To identify devotees who have dharmic blend of mind for promoting HDPP programmes at the respective places
  • To conduct mass wedding to the poor couples with the blessings of Lord Venkateswara 
  • Coordinate with SVBC for extended HDPP activities.
  • Promoting evening bhajan programs at all TTD kalyana Mandapams by constructing one mandir and one bhajan hall in each.

JEO Sri P Basant Kumar, HDPP Secretary Dr C Rajagopalan, Annamacharya Project Director Acharya Dakshinamurthy, HDPP Executive Committee member Sri Penchalaiah, TTD All Projects Liaison Officer Sri Venkata Sharma were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్యక్ర‌మాల‌పై టిటిడి ఛైర్మ‌న్ స‌మీక్ష‌

తిరుమల, 07 నవంబరు 2020: హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్యక్ర‌మాల‌పై టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శ‌నివారం సాయంత్రం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను గ్రామ‌స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప‌లు సూచ‌న‌లు చేశారు.

– కార్తీక దీపోత్స‌వం రోజున తిరుమ‌ల‌లో తొలిసారిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి కార్తీక దీప నీరాజ‌నం పేరుతో ఆల‌య నాలుగు మాడ వీధుల్లో దీపాలు వెలిగిస్తారు.

– జిల్లా ధ‌ర్మ‌ప్ర‌చార మండ‌లి పేరుతో ఆస‌క్తి గ‌ల భ‌క్తులను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల్లో ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌.

– గ‌తంలో ఎంతోమంది పేద యువ‌తీ యువ‌కుల‌కు సామూహికంగా క‌ల్యాణాలు చేయించిన క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మాన్ని తిరిగి ప్రారంభించేందుకు నూత‌న విధి విధానాలు రూపొందించాల‌ని అధికారుల‌కు ఆదేశం.

– హెచ్‌డిపిపి కార్య‌క్ర‌మాల‌ను ఎస్వీబీసీ స‌హ‌కారంతో విస్తృతంగా ప్ర‌చారం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు.

– టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల్లో మందిరం, భ‌జ‌న మందిరం నిర్మించి క్ర‌మం త‌ప్పకుండా ప్ర‌తిరోజూ సాయంత్రం భ‌జ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు నిర్ణ‌యం.

ఈ స‌మావేశంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి, హెచ్‌డిపిపి కార్య‌నిర్వాహ‌క క‌మిటీ స‌భ్యులు శ్రీ పెంచ‌ల‌య్య‌, టిటిడి ప్రాజెక్టుల లైజ‌న్ అధికారి శ్రీ వెంక‌ట‌శ‌ర్మ పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.