10th EDITION OF SUNDARAKANDA AKHANDA PARAYANAM HELD _ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు

Tirumala, 21 Feb. 21: As part of spiritual campaign against pandemic Covid Virus, TTD organised the 10th edition of Sundarakanda Akhanda Parayanam at Nada Neeranjanam platform in Tirumala on Sunday.

As many as 200 Vedic pundits including those from Dharmagiri Veda Vijnana Peetham, SV Vedic University, National Sanskrit university and TTD Veda Parayanadars recited 188 shlokas from 39 to 44 Sargas of Sundarakanda on Sunday between 7am and 9am. The recitation was carried out by Vedic Scholars Sri Seshacharyulu, Sri Panakumara Sharma and Sri Maruti.

While at the beginning of the programme, Dr G Bala krishna Prasad, the Asthana Gayaka of TTD along with Ammanacharya Project artist Smt Bullemma rendered Annamacharya Kriti “Veedevo ala Vijayaraghavudu” and at the end rendered “Perginadu Choodarao Pedda Hanumantudu” with melody.

The SVBC channel live telecasted the parayanam for benefit of global devotees.

Additional EO and SVBC MD Sri AV Dharma Reddy, National Sanskrit Varsity VC Sri Muralidhara Sharma, Annamacharya Project Director Sri Dakshinamurthy and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు

తిరుమల, 2021 ఫిబ్రవరి 21: విశ్వంలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉద‌యం సుందరకాండలోని 39వ సర్గ నుంచి 44వ సర్గ వరకు ఉన్న 189 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. ఈ పారాయణంతో తిరుమలగిరులు పులకించాయి. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు పారాయణం జరిగింది.

కోవిడ్ – 19 వ్యాధిని అరికట్టాలని, లోక క‌ల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న‌ పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 318 రోజులు పూర్తి చేయగా, ఫిబ్రవరి 21వ తేదీకి సుందరకాండ పారాయ‌ణం 256 రోజులు పూర్తి అయింది. వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ పారాయ‌ణం వ‌ల‌న బుద్ధి, బ‌లం, ధైర్యం కలిగి స‌కల జీవులు ఆయురారోగ్యాల‌తో ఉంటాయని పండితులు తెలిపారు.

సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గ‌ల‌లోని 2,821 శ్లోకాల‌ను మొత్తం 16 ప‌ర్యాయాలు అఖండ పారాయ‌ణం నిర్వ‌హిస్తారు. టిటిడి ఇప్పటివరకు 9 ప‌ర్యాయాలు సుందరకాండ అఖండ పారాయ‌ణం పూర్తి చేసింది.

పదో విడ‌త‌ అఖండ పారాయ‌ణంలోని 189 శ్లోకాలను శ్రీ శేషాచార్యులు, శ్రీ ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌, శ్రీ మారుతి పారాయ‌ణం చేశారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, శ్రీమతి బుల్లెమ్మ బృందం ” వీడివో అల విజయ రాఘవుడు…, సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించి “పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు… సంకీర్తనతో ముగించారు.

ఈ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు కలిపి దాదాపు 200 మంది పాల్గొన్నా‌రు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత వర్సిటీ ఉప కుల‌ప‌తి ఆచార్య మురళీధరశర్మ, అన్న‌మాచార్య ప్రాజెక్ట్ సంచాల‌కులు శ్రీ దక్షిణామూర్తి, ఉన్నత వేద అధ్యయన సంస్థ ప్ర‌త్యేకాధికారి డా. విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.