SRIVARI DEVOTEES SOON TO EXPERIENCE ”DIVINE FRAGRANCE” _ ఆగస్టు 15న టీటీడీ అగరబత్తుల విడుదలకు చర్యలు తీసుకోండి : టీటీడీ ఈవో
TTD TO SELL INCENSE STICKS OUT OF USED GARLANDS FROM AUGUST 15 ONWARDS
Tirupati, 21 July 2021: In a unique and an innovative the initiative, TTD has decided to brighten up the houses of Srivari devotees soon with the divine fragrance that emanates from the incense sticks made out of the sacred garlands which are being used in all the TTD-run temples every day.
In this regard, TTD Executive Officer Dr KS Jawahar Reddy organised a review meeting at his chambers in TTD Administrative Building in Tirupati on Wednesday and directed the officials to organise the sale of these sacred incense sticks made out of the used flower garlands from August 15 onwards.
EO said the Darshan International Limited, the leading incense sticks manufacturer from Karnataka has come forward to make these incense sticks on a cost to cost basis and the officials have been instructed to commence the distribution and sales from the Independence Day onwards. He said in the first phase, these sacred incense sticks will be sold to devotees near the Laddu counters in Tirumala and later on at other places.
Later the EO also reviewed the strengthening of the SV Ayurvedic Pharmacy of TTD with the officials concerned. The officials informed the EO that already the Ministry of AYUSH had given nod to 115 products of TTD and 70 more under process. The EO instructed the TTD Engineering department officials to complete the tender process by month-end for the purchase of new equipment for the modernisation of the SV Pharmacy. Later the EO also directed the officials of SV Dairy Farm to take up the manufacture of 15 varieties of products out of Panchagavya.
FA&CAO Sri O Balaji, CE Sri Nageswara Rao, SE Sri Jagadeeshwar Reddy, SV Farm Diary Director Dr. Harnath Reddy, SV Ayurvedic College Principal Dr Muralikrishna were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 15న టీటీడీ అగరబత్తుల విడుదలకు చర్యలు తీసుకోండి : టీటీడీ ఈవో
తిరుపతి 21 జూలై 2021: టీటీడీ లోని ఆలయాల్లో స్వామి వార్లకు ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ముడి సరుకు ఖర్చు మాత్రమే తీసుకుని, అగర బత్తులు తయారుచేసి టీటీడీకి ఇస్తుందన్నారు. వీటికి ఎంఆర్ పి నిర్ణయించి అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మొదటి విడతగా తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద ఆగస్టు 15న అమ్మకాలు ప్రారంభించి, తరువాత ఇతర ప్రాంతాల్లో విక్రయాలకు ఏర్పాట్లు చేయాలన్నారు.
పంచ గవ్య తోటి తయారు చేయాలని నిర్ణయించిన 15 రకాల ఉత్పత్తుల గురించి ఈవో అధికారులతో చర్చించారు. వీటిని త్వరలోనే విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని బలోపేతం చేసి మరిన్ని ఉత్పత్తులు తయారు చేయడంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే 115 రకాల ఉత్పత్తులకు ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి లైసెన్స్ తీసుకున్నామని అధికారులు తెలిపారు. మరో 70 ఉత్పత్తుల తయారీకి లైసెన్స్ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. ఫార్మసీ ఆధునీకరణ పనులు త్వరగా పూర్తి చేసి, అవసరమైన కొత్త యంత్రాలు సమీకరించుకోవడానికి ఈ నెలాఖరుకు టెండర్లు పూర్తి చేయాలని ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఎఫ్ఏ అండ్ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ శ్రీ జగదీశ్వర రెడ్డి, ఎస్వీ డైరీఫామ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ సమావేశంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది