15th EDITION OF SUNDARAKANDA AKHANDA PATHANAM HELD _ రామనామస్మరణతో సాగిన సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 21 Jun. 21: To relieve the humanity from Corona Pandemic, TTD has been conducting Parayana Yagnam from the past 13 months and in this connection, the 15th Edition of Sundarakanda Akhanda Pathanam held at the Nada Neeranjanam platform in Tirumala on Monday.

As part of this Akhanda parayanam, 174 shlokas from 59 to 64 sargas from the Epic Sundarakanda were recited by the Vedic pundits of Dharmagiri Veda Vignana Peetham, SV Vedic University, National Sanskrit University and TTD Veda Parayanamdars which was telecasted live on SVBC between 6am and 8 am on Monday for the sake of global devotees.

Among the Vedic Scholars Sri KSS Avadhani, Sri Pavana Kumar Sharma, Sri Maruti and many others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPAT

రామనామస్మరణతో సాగిన సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2021 జూన్ 21: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై సోమవారం ఉద‌యం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు సుందరకాండలోని 59 నుండి 64వ సర్గ వరకు గ‌ల 174 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయ‌ణం చేశారు. కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ లోక క‌ల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 438 రోజులు పూర్తికాగా, జూన్ 21వ తేదీ నాటికి సుందరకాండ పారాయ‌ణం 376 రోజులు పూర్తి చేసుకుందని వివ‌రించారు.

15వ‌ విడ‌త‌ అఖండ పారాయ‌ణంలోని 174 శ్లోకాలను ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని పర్యవేక్షణలో శ్రీ పివిఎన్ఎన్.మారుతి‌, శ్రీ ఎం. పవనకుమార శర్మ పారాయ‌ణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి దంప‌తులు, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల అధ్యాప‌కులు, పండితులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.