15th EDITION OF SUNDARAKANDA AKHANDA PATHANAM ON JUNE 21 _ జూన్ 21న 15వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 20 June 2021: To relieve the humanity from Corona Pandemic, TTD is conducting the 15th Edition of Sundarakanda Akhanda Pathanam on June 21 at the Nada Neeranjanam platform in Tirumala.

In this connection, parayanam of 174 shlokas of 59 to 64 sargas from the Epic Sundarakanda will be conducted between 6am and 8am where Vedic pundits of Dharmagiri Veda Vignana Peetham, SV Vedic University, National Sanskrit University and TTD Veda Parayanamdars will participate. 

TTD has planned to undertake parayanams of a total of 2821 shlokas of 68 sargas in 16 editions. So far 14 phases have been successfully completed and gearing up for the 15th phase on Wednesday.

The Akhanda Sundarakanda Pathanam will be live telecasted by the SVBC to enable the Srivari devotees across the globe to participate in the parayanam from their homes and beget the blessings of Srivaru.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ 21న 15వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2021 జూన్ 20: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జూన్ 21వ తేదీ సోమవారం 15వ విడ‌త‌ సుందరకాండ  అఖండ పారాయణం జ‌రుగ‌నుంది.      

ఇందులో భాగంగా ఉద‌యం 6 గంటల నుండి 8 గంటల వరకు సుందరకాండలోని 59 నుండి 64వ సర్గ వరకు 6 సర్గల్లో గ‌ల 174 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులు ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు. కాగా, సుంద‌ర‌కాండ‌లో మొత్తం 68 స‌ర్గ‌ల్లో 2,821 శ్లోకాలు ఉన్నాయి. వీటిని 16 విడ‌త‌లుగా అఖండ పారాయ‌ణం చేయాల‌ని టిటిడి సంక‌ల్పించింది. ఇప్పటివరకు టిటిడి 14 విడ‌త‌ల్లో అఖండ పారాయణాన్ని విజయవంతంగా నిర్వహించింది.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద‌యం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.