TEPPOTSAVAMS COMMENCES _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో తెప్పోత్సవాలు ప్రారంభం

Tiruchanoor, 20 Jun. 21: The annual Teppotsavams commenced in Tiruchanoor temple in Ekantam in view of Covid guidelines on Sunday.

The five-day fete will be observed in the temple premises itself.

On the first day Abhishekam was performed to Sri Rukmini Satyabhama Sameta Sri Krishna Swamy in Sri Krishna Mukha Mandapam in Tiruchanoor temple between 2pm and 4:30pm.

Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2021 జూన్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల‌ పాటు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా తెప్పోత్స‌వాలు నిర్వ‌హిస్తారు.

కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఉత్సవమూర్తులకు ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో రుక్మిణి స‌త్య‌భావ స‌మేత శ్రీ కృష్ణస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంద్ర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

జూన్ 21న శ్రీ సుందరరాజస్వామివారికి, జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి మ‌ల్లీశ్వ‌రి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.