SVBC OFFICES AT CHENNAI & BANGALORE- SVBC BOARD _ చెన్నై బెంగుళూరులో ఎస్వీ బిసి కార్యాలయాలు

ALL PROGRAMS LOCALLY DONE

 

Tirupati, 24 March 2022: The SVBC board on Thursday decided to set up offices at Chennai and Bangalore to enhance the quality of local programs with local productions for its Tamil and Kannada channels.

 

The SVBC board met at the SVBC office under the Chairmanship of Sri YV Subba Reddy where officials narrated that the Tamil, Hindi and Kannada channels launched last year had received good response.

 

In order to augment the standards of programs of these channels, SVBC board has decided to open offices at Chennai and Bangalore to promote quality programs by involving local public personalities as partners.

 

The SVBC board also decided to generate programs in regional languages besides Hindi in collaboration with local networks.

 

Following good response for TTD parayanam programs from Nada Neeranjanam platform during covid season TTD Chairman directed officials to make all arrangements for telecast of another unique parayanam program -Yoga darshanam from April 2.

 

SVBC Chairman Sri Sai Krishna Yachendra, SVBC board members Sri Vishwanath, Sri Srinivas Reddy, TTD Additional EO Sri AV Dharma Reddy, FA&CAO Sri Balaji, SVBC CEO Sri Suresh Kumar, and Honorary Advisor Sri Vijay Kumar Sammeta were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చెన్నై బెంగుళూరులో ఎస్వీ బిసి కార్యాలయాలు

– స్థానికంగానే కార్యక్రమాల చిత్రీకరణ

– ఎస్వీ బిసి పాలకమండలి నిర్ణయం

తిరుపతి 24 మార్చి 2022: శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తమిళ, కన్నడ కార్యక్రమాలను ఆయా ప్రాంతీయ భాషలకు చెందిన భక్తుల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళడానికిచెన్నై, బెంగళూరు నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

శ్రీ వేంకటేశ్వర భక్తిఛానల్ కార్యాలయంలో గురువారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఎస్వీబిసి పాలక మండలి సమావేశం జరిగింది.

ఎస్వీబిసి గత ఏడాది ప్రారంభించిన తమిళ, కన్నడ, హిందీ చానళ్లకు విశేష స్పందన లభిస్తోందని అధికారులు వివరించారు. తమిళ, కన్నడ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి చెన్నై, బెంగుళూరు నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి స్థానికంగానే కార్యక్రమాల చిత్రీకరణ చేయాలని నిర్ణయించారు. వీటిలో స్థానిక ప్రముఖులను భాగస్వాములను చేస్తే కార్యక్రమాలకు మరింత ఆదరణలభిస్తుందని సమావేశం భావించింది. ప్రాంతీయ భాషలతో పాటు, హిందీ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి స్థానిక నెట్ వర్క్ లతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని పాలకమండలి అధికారులకు సూచించింది. కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ, తిరుమల నాద నీరాజనం వేదిక మీద నుంచి నిర్వహిస్తున్న పారాయణ కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి యోగ దర్శనం పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.

ఎస్వీబిసి చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర, ఎస్వీబిసి పాలక మండలి సభ్యులు శ్రీ విశ్వనాథ్, శ్రీ శ్రీనివాస రెడ్డి, టీటీడీ అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, ఎఫ్ఎసిఎఓ శ్రీ బాలాజి, ఎస్వీబిసి సీఈవో శ్రీ సురేష్ కుమార్, గౌరవ సలహాదారు శ్రీ విజయకుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది