ఆగష్టు 6 నుండి 8వ తేది వరకు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఆగష్టు 6 నుండి 8వ తేది వరకు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2010 జూలై 31: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆగష్టు 6వ తేది నుండి 8వ తేది వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతా శౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్దం. అయినా యాత్రీకుల వల్లగాని, సిబ్బంది వల్ల గాని తెలిసీ తెలియక ఇలాంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు తెలిసీ, తెలియక జరిగే దోషాల పరిహరణార్థం జరిగే పవిత్ర కార్యక్రమమే ”పవిత్రోత్సవం”.

ఈ పవిత్రోత్సవాలలో 3 రోజులు ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం, హోమాలు, అభిషేకాలు జరుగుతాయి. ఆర్జితంగా జరిగే ఈ పవిత్రోత్సవంలో 500/- చెల్లించి ఇద్దరు గృహస్తులు పాల్గొనవచ్చును. ఈ సందర్భంగా హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయి.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.