ARRANGEMENTS FOR KARTHIKA MAHA DEEPOTSAVAM IN TIRUPATI _ తిరుపతిలో కార్తీక మ‌హా దీపోత్స‌వానికి ఏర్పాట్లు పూర్తి: టిటిడి

Tirupati, 17 November 2024: The elaborate arrangements were made by TTD for the Karthika Maha Deepotsavam to be organized on the night of November 18 at the TTD Administration Building Parade Grounds in Tirupati.

TTD organizes the fete under the auspices of HDPP and will be telecast live on SVBC.

As part of this, the entire ground is spruced up to facilitate women devotees to lit the ghee lamps in mud pots.

The stage is decorated with flowers, electric illumination and settings are being made on both sides of the stage to create a spiritual atmosphere under the supervision of the Engineering Department.

Special arrangements have been made for the Sri Mahalakshmi Puja to be held as part of the program. 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుపతిలో కార్తీక మ‌హా దీపోత్స‌వానికి ఏర్పాట్లు పూర్తి: టిటిడి

తిరుప‌తి‌, 2024 న‌వంబ‌రు 17: తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప‌రేడ్ మైదానంలో నవంబరు 18వ తేదీ రాత్రి నిర్వహించనున్న కార్తీక మ‌హాదీపోత్స‌వానికి టిటిడి చేపట్టిన విస్తృత ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

హెచ్ డీపీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని టిటిడి కోరుతోంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందించనున్నారు.

ఇందులో భాగంగా మ‌హిళ‌లు కూర్చుని దీపాలు వెలిగించేలా దీప‌పు దిమ్మెలు, నేతి వ‌త్తులు ఏర్పాటు చేస్తున్నారు. మైదానం మొత్తం తివాచీలు, ఒక్కో దీపపు దిమ్మె వ‌ద్ద తుల‌సి మొక్క‌ను ఉంచనున్నారు. కార్య‌క్ర‌మం అనంత‌రం మ‌హిళ‌లకు ఈ మొక్క‌ల‌ను అందిస్తారు.

వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాలు, వేదిక ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వహించనున్న శ్రీ మ‌హాల‌క్ష్మీపూజ‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేపట్టారు. టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ప్ర‌ధాన ద్వారాల నుంచి ఆవ‌ర‌ణం మొత్తం అర‌టి చెట్లు, పూలు, విద్యుద్దీపాల‌తో అలంకరించనున్నారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.