DEVOTEES’S HEARTS BLOSSOMS FOR FLOWER SHOW _ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్ప ప్రదర్శనశాల
Tirupati, 28 November 2024: The colourful and splendid flower show organised by the Garden Wing of TTD has won the accolades of the devout with its grandeur.
On the occasion of the annual Brahmotsavam of Sri Padmavati Devi at Tiruchanoor, the flower exhibition was set up at the Friday Gardens by the TTD Garden department which was inaugurated on Thursday.
Various mythological characters etched in floral dioramas have been impressing the visiting devotees to a great extent.
Sri Maha Vishnu in the form of protecting the Mother Earth by killing the demon Hiranyaksha, Rama killing Vali hiding behind a tree during the battle between Vali and Sugriva, Kumbhakarna fighting in the battlefield, Padmavathi Devi in the guise of an old woman serving the laddu prasadam to Annamayya are a few to mention.
While others includes Vasudeva crossing the river with little Krishna, Vanara Sena building the bridge and many more besides the designs of animals and birds arranged with different flowers and vegetables attracted the devotees.
Ms. Gauri, a sand artist from Mysore who has been offering her services to TTD from the past nine years has created Sri Padmavati Sametha Venkateswara Swamy on Sand this year.
Similarly, Expo Ayurveda was organized under the auspices of SV Ayurveda College, Herbal Exhibition under the auspices of SV Ayurveda Pharmacy and free Ayurvedic medical camp.
The sculpture art exhibition set up by the SV Institute of Traditional Sculpture and Architecture stood as a cynosure.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్ప ప్రదర్శనశాల
తిరుపతి, 2024 నవంబరు 28: శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుచానూరులోని శుక్రవారపుతోటలో ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇందులో టీటీడీ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో ‘ హిరణ్యక్షుడనే రాక్షసుడిని సంహరించి భూదేవిని కాపాడుతున్న వరాహరూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు, వాలి సుగ్రీవుల మధ్య జరిగే యుద్ధంలో చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తున్న రాముడు, శ్రీ రామ రావణ యుద్ధంలో వనరులతో యుద్ధం చేస్తున్న కుంభకర్ణుడు అనే రాక్షసుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు.
శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఆరగించిన లడ్డును ముసలి అవ్వ రూపమున అన్నమయ్యకు అందిస్తున్న పద్మావతమ్మ, సీతాదేవి అన్వేషణలు శ్రీరామ లక్ష్మణుల సమక్షంలో లంకకు వారధి కడుతున్న వానరసైన్యం, ఎరుకుల సాని వేషంలో పద్మావతి దేవికి సోది చెబుతున్న శ్రీనివాసుడు, లక్క గృహం దహనం నుండి తల్లి కుంతీదేవితో సహా సోదరులను కాపాడుకొని తన భుజస్కందాలపై తీసుకొస్తున్న భీమసేనుడు, చిన్ని కృష్ణుడిని యమునా నది దాటిస్తున్న వసుదేవుడు రావణాసురుడిని సంహరిస్తున్న శ్రీరాముడు తదితర ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి.
వివిధ పుష్పాలు, కూరగాయలతో ఏర్పాటు చేసిన జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను విశేషంగా ఆకర్షించాయి.
మైసూర్ కు చెందిన గౌరి గత 9 సంవత్సరాలుగా సైకిత శిల్పాన్ని తయారు చేస్తోంది, ఈ ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి సైకిత శిల్పాన్ని రూపొందించారు
అదేవిధంగా, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఎక్స్‌పో ఆయు, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ఏర్పాటు చేసిన శిల్ప కళ ప్రదర్శనశాల భక్తులను ఆకట్టుకుంటోంది.
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి డా. కార్తీక్, డా. వాణి ఆధ్వర్యంలో 80 మంది, ఎస్పీడబ్ల్యూ కాలేజీ నుంచి బాటనీ విభాగానికి చెందిన డా.జ్యోతి ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థినులు ఫలపుష్ప ప్రదర్శన శాలను తిలకించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.