COLOURFUL DISPLAY OF ARTS _ హనుమంత వాహనసేవలో సాంస్కృతిక శోభ

TIRUPATI, 01 DECEMBER 2024: The artistes have exhibited a colourful display of their art forms in front of Hanumanta Vahana Seva on Sunday evening.

Nava Durga, Sri Goda Kalyanam, Sri Krishna Leela, Sri Anjaneyam, Asta Lakshmi Vaibhavam portrayed by the artistes which impressed the devotees.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనసేవలో సాంస్కృతిక శోభ

తిరుమల, 2024 డిసెంబరు 01: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన ఆదివారం రాత్రి హనుమంత వాహనసేవలో వివిధ రాష్ట్రాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత‌ ప్రదర్శనలిచ్చారు.

టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 11 కళాబృందాలు, 252 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు.

శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే శ్రీ ఆంజనేయం, శ్రీకృష్ణ లీలలు నృత్య రూపకాన్ని ప్రదర్శించి భక్తులను అలరించారు. కర్ణాటకకు చెందిన కళాకారులు నవదుర్గలు, అష్టలక్ష్మి వైభవం, శ్రీ ఆండాళ్ కళ్యాణం ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు.

అదేవిధంగా కడప డ్రమ్స్, భరతనాట్యం, కోలాట నృత్యాలతో కనువిందు చేశారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.