DEVOTIONAL CULTURAL FIESTA IN SRI KT _ శంభో శివ శంభో…, ప్రభు ప్రాణనాదం ….., సంకీర్త‌న‌ల‌తో కైలాసాన్ని తలపించిన కపిలతీర్థం

Tirupati, 21 February 2025: The devotees enjoyed double dhamaka witnessing the celestial procession of deities on one side and the artists performing classical dance and music on the other hand.

The dance performed by the retired Principal of SVCMD Principal Dr Prabhavati and her team stood as a special attraction.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శంభో శివ శంభో…, ప్రభు ప్రాణనాదం ….., సంకీర్త‌న‌ల‌తో కైలాసాన్ని తలపించిన కపిలతీర్థం

తిరుపతి, 2025 ఫిబ్రవరి 21: శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ ఎస్వీ సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన భ‌క్తి సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాశాల అధ్యాపకులు శ్రీమతి శైలజ బృందం మ‌రియు క‌ళాశాల‌ విద్యార్థినీ విద్యార్థులచే శివనామ సంకీర్తనల గానం అధ్బుతంగా జరిగింది. ఇందులో శంకర శశిధర…., తిరువీధుల మెరసి దేవదేవుడు….., గజవదన బెడువే…. తదితర భజన సాంప్రదాయ సంకీర్తనలు గానంచేసి భక్తులను అలరించారు.

అనంతరం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభావతి బృందం “భ‌ర‌త‌నాట్యం” ప్రదర్శన వీక్షకులను ఆక‌ట్టుకుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.