BHOOMI PUJA TO SRIVARI TEMPLE IN KARIMNAGAR _ 31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ  

TIRUPATI, 19 MAY 2023: The Bhoomi Puja for the construction of the Srivari temple at Karimnagar in Telangana State is scheduled on May 31. 

In connection with this, TS Minister Sri Kamalakar, Telangana State Planning Commission Vice Chairman Sri Vinod Kumar, Hyderabad LAC Chief Sri Bhaskar Rao have formally met TTD EO Sri AV Dharma Reddy at his chamber in TTD Administrative Building on Friday. 

The TS Government has allocated 20 acres of land to TTD towards the construction of the temple in Karimnagar City. The EO said, before the Bhoomi Puja, Bhukarshana (ploughing the sacred land where the temple is going to come up) ritual will be performed by the Archakas on May 22. Later the construction work commences. He also said, on May 31 after the Bhoomi Puja, Srivari Kalyanam will be organised in a big manner on the same day evening for the sake of the local devotees.

The high-level team from TS said they will make elaborate arrangements for the TTD religious and non-religious staff members who will be participating and executing the religious event.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, EE Sri Narasimha Murty, Agama Advisor Sri Mohana Rangacharyulu, one the priests of Tirumala temple Sri Venugopala Deekshitulu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

– టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డితో తెలంగాణ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష్యుడు,

టీటీడీ స్థానిక సలహా మండలి అధ్యక్ష్యులు సమావేశం

తిరుపతి 19 మే 2023: తెలంగాణ రాష్ట్రం కరీం నగర్ పట్టణంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనుంది. మే 31వ తేదీ భూమి పూజ కార్యక్రమం కోసం ఆరాష్ట్ర మంత్రి శ్రీగంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష్యులు శ్రీ వినోద్ కుమార్, హైదరాబాద్ టీటీడీ స్థానిక సలహామండలి అధ్యక్ష్యులు శ్రీ భాస్కర్ రావు శుక్రవారం టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తో సమావేశమయ్యారు.

ఆలయ నిర్మాణానికి టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల గురించి వారు వివరించారు. కరీంనగర్ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండేలా టీటీడీ చక్కగా ఆలయాన్ని నిర్మించాలని వారు కోరారు. భూమి పూజకు ముందుగా మే 22వ తేదీ టీటీడీ అర్చకులు భూకర్షణం కార్యక్రమం నిర్వహిస్తారని ఈవో తెలియజేశారు. ( గర్భాలయ స్థలాన్ని నాగలితో దున్నుతారు. అక్కడ నవధాన్యాలు చల్లుతారు. ధాన్యాలు మొలకెత్తిన తరువాత గోవులకు ఆహారంగా వినియోగిస్తారు. ఆ తరువాత చదును చేసి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. దీన్నే భూకర్షణం అంటారు)

31వ తేదీ భూమి పూజ ముగిశాక అదే ప్రాంగణంలో సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తామని మంత్రి చెప్పారు. టీటీడీ అర్చకులు, సిబ్బందికి అవసరమైన వసతి సమకూరుస్తామన్నారు.

జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీనాగేశ్వర రావు, ఈఈ శ్రీ నరసింహమూర్తి, ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది