4 TROUPS 410 ARTISTS _ శ్రీ‌వారి పెద్ద శేష వాహ‌న సేవాలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

Tirumala, 04 October 2024: And the first day of the ongoing annual brahmotsavam Tirumala, during the Pedda Sesha Vahana seva on friday evening, the performance of artists enthral the devotees.

A total of 14 troupes consisting 410 artists hailing from Odisha, Kerala, Tamil Nadu, Karnataka performed their arts.

Mayura Nrityam, Yaksha Ganam, Kolatams, Oggu Dolu are a few to mention.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి పెద్ద శేష వాహ‌న సేవాలో ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

తిరుమల, 2024 అక్టోబ‌రు 04: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో మొద‌టి రోజైన శుక్ర‌వారం రాత్రి పెద్ద శేష‌ వాహ‌న సేవ‌లో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 14 క‌ళాబృందాలలో 410 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు.

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒడిస్సీ నృత్యం, తమిళనాడుకు చెందిన లతారవి ఆధ్వర్యంలో మయూర నృత్యం, కేరళ రాష్ట్రానికి చెందిన వీణ బృందం యక్షగానం, కర్నాటక కళా రూపమైన వీరగాశను చేతన్ బృందం అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు. శ్రీకాకుళం నుండి శ్రీ‌మ‌తి దుర్గా భవానీ, తిరుమల నుండి శ్రీనివాసులు, రాజమండ్రి నుండి శ్రీ‌సురేష్ బాబు, తిరుపతి బాలమందిర్ విద్యార్థులు కోలాటాలతో మంత్ర ముగ్ధుల‌ను చేశారు.

హైదరాబాదుకు చెందిన శ్రీ‌మ‌తి లక్ష్మీదేవి బృందం ఒగ్గుడోలుతోను, తిరుపతికి చెందిన డాక్టర్ మురళీకృష్ణ బృందం మోహినీయట్టంతోను, కర్నాటకకు చెందిన శ్రీ‌మ‌తి వనీష బృందం పటకునిత కళా విన్యాసం, శ్రీ రవికుమార్ చిలిపిలి గొంబె నృత్యం, శ్రీ నాగేంద్ర బృందం కంసాలి రూపకంతో తమ అద్భుతమైన ప్రదర్శనలతో భక్తులకు నయనానందాన్ని కలిగించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది