SPECIALISED ARTISTES TO PERFORM DURING AMMAVARI BRAHMOTSAVAMS-JEO_ నవంబరు 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాలు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tiruchanoor, 20 October 2017: The performance of eminent artistes from AP and its surrounding states is going to be special attraction during Tiruchanoor Brahmotsavams said, Tirupati JEO Sri P Bhaskar.

A review meeting on the ensuing brahmotsavams of Tiruchanoor was held at the asthanamandapam on Friday evening.

Speaking on this occasion, the JEO said, Tiruchanoor brahmotsavams are scheduled from November 15-23 and the arrangements by various departments have already commenced. The importnt days includes Dhwajarohanam on November 15, Gaja Vahanam on November 19 and Panchami Teertham on November 23 followed by Pushpayagam on November 24.

“The electrical and civil works, pushkarini cleaning are already underway. All the arranagements will be completed by November 10 while the decoration by Garden wing a couple of days before”, the JEO added.

He said, a final review meeting by TTD EO Sri AK Singhal will be organised in the first week of November. ” Elaborate security arrangements by CVSO Sri A Ravikrishna are in pace. The cultural activities will also enthrall pilgrims”, he maintained.

Addl SP Sri Swamy, DSP Sri Muniramaiah, Special Grade DyEO Sri P Muniratnam Reddy, Tirumala temple DyEO Sri Kodanda Rama Rao, SE Sri Sri Ramulu, GM Sri Sesha Reddy and other senior officers were also present.

CVSO INSPECTS PUSHKARINI

Earlier the CVSO Sri A Ravikrishna along with Additional CVSO Sri Sivakumar Reddy inspected Pushkarini, which is gearing up for Panchami Teertham.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

నవంబరు 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాలు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

అక్టోబరు 20, తిరుపతి, 2017: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలను నవంబరు 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల ఆస్థానమండపంలో శుక్రవారం సాయంత్రం ఆయన బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల తరువాత ఆ స్థాయిలో పెద్ద ఎత్తున జరిగే అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాలకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశముందని, ఇందుకోసం లడ్డూ, ఇతర ప్రసాదాలను తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు. క్యూలైన్లు, బ్యారికేడ్లు, విద్యుత్‌, ఇతర సివిల్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. వాహనసేవల కోసం తండ్లను సిద్ధం చేసుకోవాలని, అదనంగా కొన్నింటిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధర్మప్రచార రథాలు, గోడపత్రికలు, కరపత్రాలు, ఆహ్వానపత్రికల ద్వారా తిరుపతి, తిరుచానూరు పరిసర గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలన్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్రముఖ రోజులైన నవంబరు 19న గజవాహనం, నవంబరు 20న బంగారు రథం, గరుడవాహనం, నవంబరు 22న రథోత్సవం, నవంబరు 23న పంచమితీర్థం నాడు రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు జెఈవో సూచించారు. పంచమితీర్థం రోజు ఏనుగుల కోసం పసుపు మండపం నుంచి పుష్కరిణి వరకు ప్రత్యేకంగా దారిని ఏర్పాటుచేయాలన్నారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రతిభ గల కళాకారులను ఆహ్వానించాలని, వాహనసేవల్లో ప్రదర్శనలిచ్చే కళాబృందాలకు మైక్‌సెట్లను అందించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. కనులవిందుగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని ఆదేశించారు. ఫ్రైడే గార్డెన్‌లో ఆకట్టుకునేలా ఫలపుష్ప, ఆయుర్వేద తదితర ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం మొబైల్‌ మరుగుదొడ్లను ఏర్పాటుచేయాలని ఆరోగ్య విభాగం అధికారులకు సూచించారు. అదేవిధంగా భద్రత, తాగునీరు, అన్నప్రసాదం, సాంస్కృతిక‌ కార్యక్రమాలు, రవాణా ఏర్పాట్లపై శాఖలవారీగా అధికారులతో జెఈవో సమీక్షించారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారి వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఎస్వీబీసీలో నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలు అందించాలన్నారు. వాహనసేవల్లో ప్రతిరోజూ పుస్తకావిష్కరణకు ఏర్పాట్లు చేపట్టాలని, భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ శ్రీ స్వామి, డిఎస్పీ శ్రీమునిరామయ్య, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-4 శ్రీ రాములు, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్‌) శ్రీ వేంకటేశ్వర్లు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీకోదండరామారావు, అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌, సిఐ శ్రీ మురళి, పంచాయతి కార్యదర్శి శ్రీ జనార్దన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.