ANKURARPANAM FOR HOMA MAHOTSAVAMS AT SRI KAPILESWARA SWAMY TEMPLE PERFORMED_ శ్రీకపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలకు వైభవంగా అంకురార్పణ
Tirupati, 20 October 2017: As the Homa Mahotsavams are set to commence from October 21, Ankurarpanam was performed in Sri Kapileswara Swamy temple on Friday evening.
As a part of it, Snapanam was performed to Panchamurthies between 9am and 10am while in the evening Ganapathi Puja, Punyahavachanam, Vastu Puja, Paryannekaranam, Mrisangrahanam and Ankurarpanam was performed with religious fervour as per tenets of Saivagama between 6pm and 8pm.
Temple DyEO Sri Subramanyam, AEO Sri Sankar Raju were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI
శ్రీకపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలకు వైభవంగా అంకురార్పణ
తిరుపతి, 2017 అక్టోబరు 20: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగనున్న విశేషపూజ, హోమ మహోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. అక్టోబరు 21 నుంచి నవంబరు 18వ తేదీ వరకు నెల రోజుల పాటు ఎనిమిది రకాల హోమాలను టిటిడి వైభవంగా నిర్వహించనుంది.
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు పంచమూర్తులకు స్నపనతిరుమంజనం తదితర పూజాధికాలు నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు గణపతిపూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ, పర్యన్నీకరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించనున్నారు. ఆ తరువాత కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, లఘుపూర్ణాహుతి చేపట్టనున్నారు.
అక్టోబరు 21 నుండి 23వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివారి హోమం, అక్టోబరు 24, 25వ తేదీలలో శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, అక్టోబరు 26న శ్రీదక్షిణామూర్తిస్వామివారి హోమం, అక్టోబరు 27న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయ. అదేవిధంగా అక్టోబరు 28 నుంచి నవంబరు 5వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం (చండీహోమం), నవంబరు 6 నుంచి 16 వరకు శ్రీకపిలేశ్వర స్వామివారి హోమం (రుద్రయాగం), నవంబరు 17న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, నవంబరు 18న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
కాగా, గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీశంకర్‌రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.