510TH ANNAMACHARYA VARDHANTHI CELERBRATION CONCLUDS _ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం

On the Concluding Day of 510th Annamacharya Vardhanthi Celebrations, Sri Govindaraja Swamy Asthanam & Gosti Ganam was performed by Annamacharya Project Singers at Annamcharya Kala Mandir in Tirupati on Saturday
 
DyEO Sri Chandra Sekhar Pillai, Tarigonda Vengamamba Co-Ordinator, Sri Krishnamurthy, Sri Chenna Kesavanaidu Annamacharya Project Co-Ordinator and devotees were Present.

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం

తిరుపతి, ఏప్రిల్‌-13, 2013: శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 510వ వర్ధంతి మహోత్సవాల్లో చివరి రోజైన శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది. భక్తుడి చెంతకు భగవంతుడు రావడం అనే ఆర్యోక్తికి తార్కానంగా శ్రీ వేంకటేశ్వరస్వామికి పరమభక్తుడైన అన్నమాచార్యుడు వెలసిన అన్నమాచార్య కళామందిరానికి శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవరు ్లవేంచేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అనంతరం గోవిందరాజస్వామివారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను ప్రాజెక్టు కళాకారులు సుమధురంగా ఆలపించారు.

అంతకుముందు ఉదయం 7.00 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా నాలుగు కాళ్ల మండపం, తీర్థకట్టవీధి మీదుగా అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఆస్థానం అనంతరం తిరిగి ఉదయం 10.00 గంటలకు ఉత్సవమూర్తులను గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు.

అనంతరం తిరుపతికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ వేంకటేశ్వరులు హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 6.00 గంటల నుండి  రాత్రి 9.00 గంటల వరకు తితిదే బోర్డు సెల్‌ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి బృందం సంగీత సభ నిర్వహించనుంది.                                                                                              
 

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు తిరుచానూరుకు చెందిన కుమారి సౌమ్య బృందం సంగీత సభ నిర్వహించనుంది.సాయంత్రం 6.15 గంటల నుండి రాత్రి 7.15 గంటల వరకుహైదరాబాద్‌కు చెందిన శ్రీమతి శారద బృందం సంగీత సబ జరుగనుంది. అలాగే రాత్రి 7.45 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకుహైదరాబాద్‌కు చెందిన శ్రీమతి పి. రాజెశ్వరి బృందం నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.జె.కృష్ణమూరి, శ్రీ గోవిందరాజులు, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
         
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.