వాల్మీకిపురం శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయాన్ని పరిశీలించి టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
వాల్మీకిపురం శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయాన్ని పరిశీలించి టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
తిరుపతి, 2019 మార్చి 19: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయంలో మార్చి 21 నుండి 24వ తేదీ వరకు బాలాలయ మహాసంప్రోక్షణను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాతం తెలిపారు. వాల్మీకిపురం శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయాన్ని, తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను జెఈవో అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామస్వామివారి ఆలయంలో రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నూతన ధ్వజస్థంభం ఏర్పాటు, అంతరాలయంలో మరమత్తులు, ఫ్లోరింగ్, పుష్కరిణి ఆధునీకరణ తదితర పనులను చేపట్టామన్నారు. అదేవిధంగా శ్రీపట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అనంతరం తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రథోత్సవం వైభంవగా జరిగిందన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు. రూ. ఒక కోటితో ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.