ELABORATE ARRANGEMENTS FOR TUMBURU THEERTHA MUKKOTI_ తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

Tirumala, 19 Mar. 19: The TTD has rolled out all measures for smooth and colourful conduct of Sri Thumburu theertham Mukkoti Festival falling on the pournami day of Phalguni month in the advent of Uttara Phalguni Nakshatra, on March 20.

Keeping in view the heavy influx of devotees for the torrent festival, TTD has made elaborate arrangements from Tuesday onwards.

About 600 odd Srivari sevakulu have been deployed on March 19 itself for Anna Prasad am, health, medical departments. They offer services in two shifts to facilitate the devotees to the holy theertham.

25,000 water bottles and 50,000 buttermilk packets are kept ready.

The TTD Anna prasadam wing has distributed packets of Upma, Pulihora, sambar rice, Pongal, curd rice and Tomato rice from Tuesday morning with the assistance of volunteers.

The engineering department has built ladders midway to theertham and set up sheds, and water taps for devotees benefit.

Health Department has deployed 50 Staffers to give priority to hygiene and cleanliness. About fifty uniform personnel have been deployed for safety of devotees from Papavinasam dam to Thumbura theertham.

Two ambulances, Paramedical staff and essential medicines are kept standby to deal emergencies if any.

Necessary signboards and staff kept on the forest path. As of now about 2000 devotees have reached the thumbura theertham and TTD will allow devotees to the holy theertham till Wednesday night.

TTD is also announcing on TTD FM radio and a broadcasting system that devotees should not carry cooking material in the forest. Solar lamps, ropes and diesel generators are kept handy and especially this year trained swimmers with life jackets also kept handy near the theertham.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

తిరుమల, 2019 మార్చి 19: పాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన పూర్ణిమినాడు అనగా మార్చి 20వ తేదీ బుధ‌వారం తిరుమలలోని ప్రముఖ తీర్థాల్లో ఒకటైన శ్రీ తుంబురు తీర్థ ముక్కోటికి విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఇందులో భాగంగా తుంబురు తీర్థ ముక్కోటికి మంగ‌ళ‌వారం ఉదయం 6.00 గంట‌ల నుండి భక్తులను అనుమతిస్తున్నారు. భ‌క్తుల కొరకు 25 వేల తాగునీరు బాటిళ్లు, 50 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో మార్చి 19వ తేది ఉదయం నుండి భక్తులకు ఉప్మా, పొంగ‌ళ్‌, సాంబార‌న్నం, పులిహోరా, టామోటా అన్నం, పెరుగన్నం ప్యాకెట్ల‌ను శ్రీ‌వారి సేవ‌కులు అందిస్తున్నారు.
శ్రీ‌వారి సేవ‌కులు –

మార్చి 19వ తేదీ మంగ‌ళ‌వారం నుండి మార్చి 21వ తేదీ గురువారం వ‌ర‌కు ప్ర‌తి రోజు దాదాపు 632 మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, వైద్య విభాగాలతో క‌లిసి భక్తులకు సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి విచ్చేసే భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు త‌యారీకి మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్ర‌సాద భ‌వ‌నంలోని వంట‌శాల‌లో 126 మంది, పిఏసి-2లో అన్న‌ప్ర‌సాదాల ప్యాకింగ్‌లో 121 మంది పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆరోగ్య విభాగంలో 159 మంది, వైద్య విభాగంలో 91 మంది సేవ‌లందిస్తు న్నారు. పాపావినాశ‌నం వ‌ద్ద 135 మంది శ్రీ‌వారి సేవ‌కులు భక్తులకు ఉదయం కాఫీ, పాలు, తాగునీరు, అల్పాహారం, మజ్జిగ, అన్నప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేస్తున్నారు.

ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యలో నిచ్చెనలు, త్రాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ 50 మంది అదనపు సిబ్బందిని నియమించారు. దాదాపు 50 మంది పోలీసు, అటవీశాఖ, అగ్నిమాప‌క మరియు టిటిడి విజిలెన్స్ సిబ్బంది సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా రెండు అంబులెన్స్‌లను, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన సమాచార బొర్డులు ఏర్పాటు చేశారు. మార్చి 19వ తేదీ ఉద‌యం 6.00 నుండి మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల వ‌ర‌కు దాదాపు 2 వేల మంది భ‌క్తులు చేరుకున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం నుండి మార్చి 20వ తేదీ బుధ‌వారం రాత్రి వ‌ర‌కు భక్తులను తుంబురు తీర్థానికి అనుమ‌తించ‌నున్నారు.

అదేవిధంగా టిటిడి రేడియో అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా ఎటువంటి వంట సామగ్రిని అనుమతించరని తెలియచేసేందుకు ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యలో భక్తులకు ఇబ్బంది లేకుండా సోలార్‌ లైట్లు, రోప్‌లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచారు. తుంబురు తీర్థం వ‌ద్ద ఈ ఏడాది ప్ర‌త్యేకంగా గ‌జ ఈతగాళ్ల‌ను, లైఫ్ జాకెట్ల‌ను సిద్ధంగా ఉంచారు.

పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నవని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి, ప్రధానమైనవి 7 తీర్థములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థములు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరించిన యెడల సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరునని పురాణ వైశిష్ట్యం.

ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భ‌క్తులు భావిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.