8 STATES SHOWCASE CULTURAL HERITAGE DURING MOHINI AVATARAM _ మోహినీ అవతార సేవలో అలరించిన 8 రాష్ట్రాల కళారూపాలు
18 ART FORMS PRESENTED BY 502 ARTISTS
Tirumala, September 19, 2026: The Mohini Avataram Seva on Saturday morning, the fifth day of Srivari Salakatla Brahmotsavams, showcased India’s rich cultural heritage.
Artists from eight states presented 18 folk and classical art forms, including Bharatanatyam, Kuchipudi, Sattriya, Odissi, Bhangra, Kolatam and Perini Sivatandavam, enthralling devotees.
Artists from TTD’s various cultural projects and institutions also participated.
Four Best Teams Honoured
TTD EO Sri Muddada Ravichandra honoured four outstanding cultural teams with shawls for their performances during the Vahana Seva.
The cultural programmes added spiritual joy to the Brahmotsavams while showcasing India’s diverse folk and classical traditions.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
మోహినీ అవతార సేవలో అలరించిన 8 రాష్ట్రాల కళారూపాలు
18 కళారూపాలతో 502 మంది కళాకారుల అపూర్వ ప్రదర్శనలు
భక్తులను మంత్రముగ్ధులను చేసిన జానపద, శాస్త్రీయ నృత్యాలు
తిరుమల, 2026 సెప్టెంబర్ 19: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం ఉదయం జరిగిన మోహినీ అవతార సేవలో భారతీయ కళా వైభవం వెల్లివిరిసింది. ఎనిమిది రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన జానపద, శాస్త్రీయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన కళాబృందాలతోపాటు టీటీడీకి చెందిన వివిధ కళా ప్రాజెక్టులు, సంస్థల కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
మొత్తం 18 కళాబృందాలకు చెందిన 502 మంది కళాకారులు 18 కళారూపాలను ప్రదర్శించారు. భరతనాట్యం, కూచిపూడి, సత్రియ, ఒడిస్సీ, భాంగ్రా, కోలాటం, పెరిణి శివతాండవం, మయూర నృత్యం, డమరుక ధ్వని విన్యాసం, అన్నమయ్య జానపదాలు తదితర ప్రదర్శనలు భక్తులను అలరించాయి.
మహారాష్ట్రకు చెందిన కథేకర్ బృందం గూమర్, పెద్దతాళాలతో జెంజ్ నృత్యం, మధ్యప్రదేశ్‌కు చెందిన మయాంక్ తివారి బృందం బడాయి నృత్యం, కేరళకు చెందిన కె. రచన బృందం తిరువట్టన్ రూపకం, అస్సాంకు చెందిన సబిత సైకియా బృందం సత్రియ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల కళాకారులు మోహినీ అవతార సన్నివేశం, భరతనాట్యం, పెరిణి శివతాండవం తదితర ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టులకు చెందిన కళాబృందాలు కూడా భక్తిరసభరిత కళా ప్రదర్శనలు అందించాయి.
నాలుగు ఉత్తమ కళాబృందాలకు ఈవో సన్మానం
వాహనసేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శాలువాతో సత్కరించారు.
• దాస సాహిత్య ప్రాజెక్టు: శ్రీ ఎం. గౌరవి రెడ్డి బృందం – సప్తగిరి వైభవం, హైదరాబాద్, తెలంగాణ – 28 మంది.
• హిందూ ధర్మ ప్రచార పరిషత్తు: శ్రీ కథేకర్ బృందం – పండర్పూర్ వార్కరీ & గర్భ నృత్యం, మహారాష్ట్ర – 60 మంది.
• శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల: శ్రీ ఎన్. శివకుమార్ బృందం – భరతనాట్యం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ – 23 మంది.
• అన్నమాచార్య ప్రాజెక్టు: శ్రీ హర్దీప్ సింగ్ బృందం – భాంగ్రా, పంజాబ్ – 15 మంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తున్న ఈ కళా ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతోపాటు భారతీయ శాస్త్రీయ, జానపద కళల వైభవాన్ని పరిచయం చేస్తున్నాయి.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.








































