TWO TEMPLES HANDED OVER TO THE ENDOWMENTS DEPARTMENT _ శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు దేవాదాయ శాఖకు అప్పగింత

Tirupati/Madanapalle, August 19, 2026: TTD officials on Wednesday formally handed over Sri Prasanna Anjaneya Swamy Temple and Sri Lakshmi Narasimha Swamy Temple at Rajanalabanda, Vengalapalle village, Chowdepalle Mandal in Annamayya district, to the Endowments Department as per the State Government orders.

At 10.30 a.m., TTD Special Grade Deputy EO of Sri Govindaraja Swamy Temple, Smt. V.R. Shanthi, formally handed over the charge of both temples to Sri Viswanatham, Endowments Department Officer, Madanapalle.

The handover of the two temples, along with their properties and jewellery, was completed as per the government orders and prescribed procedures, TTD officials said.

TTD CAO Sri Venkataramana, Task Force Tahsildar Smt. Lalithanjali, Sri Govindaraja Swamy Temple AEO Sri A.B. Narayana Chowdary, Superintendent Smt. Padma Priya and other officials and staff participated.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు దేవాదాయ శాఖకు అప్పగింత

తిరుపతి/మదనపల్లి, 2026 ఆగస్టు 19: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లె గ్రామం రాజనాలబండలోని శ్రీ ప్రసన్నఆంజనేయస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను బుధవారం టీటీడీ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయశాఖకు అధికారికంగా అప్పగించారు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉదయం 10.30 గంటలకు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ సముదాయాల ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, మదనపల్లిలోని దేవాదాయ శాఖ అధికారి శ్రీ విశ్వనాథంకు రెండు ఆలయాల బాధ్యతలనుఅధికారికంగా అప్పగించారు.

టీటీడీ పరిధిలో ఉన్న ఈ రెండు ఆలయాలతో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు, ఆభరణాలను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధితదేవాదాయ శాఖకు అప్పగించే ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సీఏవో శ్రీ వెంకటరమణ, టాస్క్‌ఫోర్స్ తహశీల్దార్ శ్రీమతి లలితాంజలి, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఏఈవో శ్రీ ఏబీనారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీమతి పద్మప్రియ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.