DHARMAGIRI GEARS UP FOR VARUNA YAGAMS _ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణయాగం, పర్జన్యశాంతి హోమం

FOR FIVE DAYS FROM AUGUST 30 –  SEPTEMBER 03

Tirumala, 29 August 2026: Seeking the divine intervention to shower good amount of rainfalls and for the well-being of the humanity, a series of Vedic rituals including Varuna Yajna, Parjanya Shanti and Kareeri Iṣṭi Yajnas—will be performed from August 30 to  September 03 at Dharmagiri Veda Vignana Peetham in Tirumala for five days.

Programme Schedule as follows :

30 August : 

Ankurarpanam:6:30pm

Followed by

7pm–8pm

Ganapati Puja, Punyahavachana and Ritvik Varana ceremony.

31 August to 03 September 

9:30 AM–12:30 PM :

Varuna Yajna, Kareeri Iṣṭi, Parjanya Shanti Homams takes place with the recitations from the Vedas, Ramayana Sundarakanda, Virataparva, and Rishyashrunga Dhyana and Parayana sessions at Dharmagiri Veda Vijnana Peetham.

6pm–8pm:

Agnihotra Anushthaanam and Veda Parayanam from Seven Sakhas at Dharmagiri.

On the other hand,  during the same time, Varuna and Parjanya Mantra Anushthaanam will also be recited at the Gogarbham Dam.

On September 03, the Rituals conclude with Purnahuti at Dharmagiri between 11am and 12noon.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణయాగం, పర్జన్యశాంతి హోమం

తిరుమల, 2026 ఆగస్టు 29: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ, పర్జన్యశాంతి సహిత కారీరిష్టి యాగాలను టీటీడీ నిర్వహించనుంది.

తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కార్యక్రమాల వివరాలు:

ఆగస్టు 30న సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్‌ వరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3వ తేది వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వరుణయాగం, కారీరిష్టి, పర్జన్యశాంతి కార్యక్రమాలతో పాటు ఏడు వేదశాఖల పారాయణం, రామాయణం, సుందరకాండ, విరాటపర్వం, ఋష్యశృంగ ధ్యాన పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గోగర్భం డ్యామ్‌ వద్ద వరుణ, పర్జన్య మంత్ర అనుష్ఠానం నిర్వహిస్తారు.

సాయంత్రం 6గం.నుండి రా. 8.గం  వరకు ధర్మగిరిలో అగ్నిహోత్ర అనుష్ఠానం, ఏడు వేదశాఖల పారాయణం జరుగుతుంది.

సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.