SERVE DEVOTEES WITH DEDICATION DURING BRAHMOTSAVAMS: TTD JEO (H&E) SRI PRABHAL GOPINATH _ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించండి – టిటిడి జేఈవో (హెచ్ అండ్ ఈ) శ్రీ ప్రభల గోపినాథ్
HEALTH AWARENESS SESSION HELD FOR DEPUTATION EMPLOYEES
Tirupati, September 10, 2026: TTD JEO (H&E) Sri Prabhal Gopinath called upon employees deputed for Srivari Brahmotsavams to serve devotees with dedication and utmost commitment.
A health awareness session for deputation employees was organised by SVETA on Thursday at Sri Vengamamba Conference Hall, SVETA Bhavan, Tirupati.
Addressing the employees, the JEO stressed the importance of maintaining good physical and mental health while serving lakhs of devotees during Brahmotsavams. He said regular health check-ups, physical activity, balanced nutrition and a healthy lifestyle are essential for preventing and controlling diabetes.
He highlighted the importance of early detection of diabetes and regular monitoring of blood glucose levels, HbA1c, blood pressure, cholesterol and body weight.
Apollo Hospital, Hyderabad, diabetes specialist Dr. J. Jayaprakash Sai explained diabetes prevention and control measures, while senior dietitian Dr. Manasa Kosireddy spoke on the importance of nutrition. Physiotherapists Dr. Vinay and Dr. Sandhyarani explained the role of physical exercise in diabetes management.
Blood glucose screening, diabetes risk assessment, nutrition counselling and health guidance were provided to the employees. Glucometers were also distributed to enable employees to monitor their blood glucose levels during the Brahmotsavams.
SVETA Director Dr. Vema Venkata Ratnam urged the deputed employees to perform their duties with devotion and a spirit of service, considering service to devotees as service to the Lord. He advised them to follow the health guidance given by medical experts regularly.
CMO Dr. Kusuma Kumari, Dasa Sahitya Project Special Officer Sri Ananda Tirthacharyulu, SVETA AEO Smt. Aruna Devi, Superintendent Smt. Susheela, Senior Assistant Sri L.C.S. Ravikumar, medical experts and a large number of deputation employees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు విశేష సేవలందించండి – టిటిడి జేఈవో (హెచ్ అండ్ ఈ) శ్రీ ప్రభల గోపినాథ్
డిప్యూటేషన్ ఉద్యోగులకు శ్వేత ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు
తిరుపతి, 2026 సెప్టెంబర్ 10: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే టిటిడి ఉద్యోగులు భక్తులకు అంకితభావంతో విశేష సేవలందించాలని టిటిడి జేఈవో (హెచ్అండ్ఈ) శ్రీ ప్రభల గోపినాథ్ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యూటేషన్ ఉద్యోగుల కోసం శ్వేత ఆధ్వర్యంలో గురువారం శ్వేత భవనంలోని శ్రీ వేంగమాంబ సమావేశ మందిరంలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులకు సేవలందించే ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించగలరని అన్నారు.
మధుమేహాన్ని ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యమని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని సకాలంలో గుర్తించి నియంత్రించవచ్చని తెలిపారు. వైద్య పరీక్షలతో పాటు క్రమబద్ధమైన శారీరక శ్రమ, సమతుల్య పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని సూచించారు. మధుమేహాన్ని ముందుగానే గుర్తించి, క్రమమైన పరీక్షలు, సరైన చికిత్సతో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని చెప్పారు.
అనంతరం బ్రహ్మోత్సవాల సమయంలో ఉద్యోగులు తమ రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను ఎప్పటికప్పుడు పరిశీలించుకునేందుకు వీలుగా జేఈవో చేతుల మీదుగా గ్లూకోమీటర్లను పంపిణీ చేశారు.
హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి చెందిన మధుమేహ వ్యాధి నిపుణులు డా. జయప్రకాశ్ సాయి మాట్లాడుతూ, మధుమేహం లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమతుల్య పోషకాహారం తీసుకోవడం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లను సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవచ్చన్నారు.
రక్తంలో చక్కెర స్థాయి, హెచ్‌బీఏ1సీ, రక్తపోటు, కొలెస్ట్రాల్, శరీర బరువు తదితర అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ ‘నో యువర్ డయాబెటిస్ నంబర్స్’ ప్రాముఖ్యతను వివరించారు.
ఉద్యోగులకు బ్లడ్ గ్లూకోజ్ స్క్రీనింగ్, డయాబెటిస్ రిస్క్ అసెస్మెంట్, పోషకాహార సలహాలు, వ్యాయామం, మధుమేహ నియంత్రణ తదితర అంశాలపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు.
శ్వేత డైరెక్టర్ డా. వేమా వేంకట రత్నం మాట్లాడుతూ, డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించే ఉద్యోగులు భక్తులలో భగవంతుడిని దర్శించుకుంటూ సేవాభావంతో తమ విధులను నిర్వర్తించాలని కోరారు. వైద్య నిపుణులు సూచించిన ఆరోగ్య సలహాలను నిరంతరం పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
మధుమేహ నియంత్రణలో పోషకాహారం ప్రాధాన్యతపై సీనియర్ డైటిషియన్ డా. మానస కోసిరెడ్డి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు శారీరక వ్యాయామం ప్రాధాన్యతపై ఫిజియోథెరపిస్ట్ డా. వినయ్, డా. సంధ్యారాణి తదితరులు అవగాహన కల్పించారు.
అనంతరం ఉద్యోగులకు మధుమేహ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు. గ్లూకోమీటర్లను కూడా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎంవో డా. కుసుమ కుమారి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, శ్వేత ఏఈవో శ్రీమతి అరుణా దేవి, సూపరింటెండెంట్ శ్రీమతి సుశీల, సీనియర్ అసిస్టెంట్ శ్రీ ఎల్.సిఎస్ రవికుమార్, వైద్య నిపుణులు, పెద్ద సంఖ్యలో డిప్యూటేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి చేత విడుదల చేయబడినది.








