TTD EO INSPECTS SV MUSEUM _ ఎస్వీ మ్యూజియాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

Tirumala, 10 September 2026: In the wake of the inauguration of the SV Museum in Tirumala by the Honourable Chief Minister of the AP, Sri N Chandrababu Naidu during Brahmotsavams next week, TTD EO Sri Muddada Ravichandra along with the Additional EO Sri Ch. Venkaiah Chowdary, Tirupati SP Sri Subbarayudu, CVSO Sri Muralikrishna inspected the arrangements at the museum on Thursday.

On this occasion, he inspected the galleries set up in the museum and made several suggestions to the officials concerned. 

The EO said that all arrangements should be made in such a way that the devotees can enjoy the artworks in the museum completely and provide feedback easily.

TTD In-Charge CE Sri Manoharam, Deputy EO Sri Somannarayana, VGO Sri Surendra and other officials participated in the program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ఎస్వీ మ్యూజియాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుమల, 2026 సెప్టెంబర్ 10: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి గురువారం ఉదయం మ్యూజియంలోని ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యూజియంలోని కళాకృతులను భక్తులు పూర్తిస్థాయిలో ఆస్వాదించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులు సులభతరంగా ఫీడ్ బ్యాక్ అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ ఛార్జ్ సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, వీజీఓ శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.