HON’BLE CM SRI CHANDRABABU NAIDU INVITED TO SRIVARI BRAHMOTSAVAMS _ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

TTD CHAIRMAN AND EO PRESENT INVITATION

Tirumala, September 12, 2026: TTD has invited Hon’ble Chief Minister Sri Nara Chandrababu Naidu to the Srivari Salakatla and Navaratri Brahmotsavams at Tirumala.

TTD Board Chairman Sri B.R. Naidu, Board Members Sri Jyothula Nehru, Smt. Panabaka Lakshmi and Smt. Janakidevi, and TTD EO Sri Muddada Ravichandra met the Chief Minister at his residence in Amaravati and presented the invitation for the Brahmotsavams.

On the occasion, TTD Vedic scholars offered Veda Ashirvachanam to the Chief Minister.

The Chief Minister discussed the arrangements for the Brahmotsavams, pilgrim amenities and security measures with the TTD Chairman and EO.

TTD Vedic scholars, archakas and officials participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

ఆహ్వాన పత్రిక అందజేసిన టీటీడీ ఛైర్మన్, ఈవో

తిరుమల, సెప్టెంబరు 12, 2026: తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఘనంగా ఆహ్వానించింది.

ఈ మేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ బోర్డు ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి పనబాక లక్ష్మీ, శ్రీమతి జానకిదేవి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడును కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు టీటీడీ ఛైర్మన్, ఈవోలతో చర్చించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ వేద పండితులు, అర్చకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది