CM OFFERS PATTU VASTRAMS TO SRI VENKATESWARA FOR 15TH TIME _ దేశం, రాష్ట్రం సిరిసంపదలతో వర్ధిల్లాలి : ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు
PRAYED FOR THE WELL-BEING OF THE PEOPLE AND GOOD RAINS
TIRUMALA IS A ROLE MODEL FOR TEMPLE CULTURE – HCM
LAUDS THE SERVICES OF TTD BOARD AND OFFICIALS
Tirumala, 15 September 2026: In a rarest feat of its kind, the Honourable Chief Minister of Andhra Pradesh Sri.N. Chandrababu Naidu offered Pattu Vastrams to Sri Venkateswara Swamy at Tirumala for the 15th time on Tuesday evening.
Offering the silk robes is a customary presentation on behalf of the State Government in connection with the annual Brahmotsavams on the first day of the nine day mega religious festival.
The CM took part in a brief ceremony at Sri Bedi Anjaneya Swamy Temple
accompanied by his spouse Smt Bhuvaneshwari. The temple priests tied him a traditional ‘Parivattam’ (silk headband).
Later he carried the sacred ‘Vastrams’ on his head in a silver plate and marched in a procession towards the main temple complex where the CM formally handed them over to the priests inside the Sanctum Sanctorum.
After darshan of Sri Venkateswara Swamy inside sanctum sanctorum, the vedic scholars offered the CM and his entourage Vedaseervachanam at Ranganayakula Mandapam.
TTD Chairman Sri B R Naidu and the EO Sri M Ravichandra offered Theertha Prasadams to the Honourable CM of AP.
Afterwards the CM released the 2027 New Year diary and calendars brought out by TTD.
Speaking on the occasion, the Honourable CM expressed that he thanked Sri Venkateswara Swamy for giving him a rare opportunity to present silk vastrams for the 15th time. I prayed to bestow His benign blessings on the people of the State and make India to become a Super Power nation in the world.
Later he lauded the services of TTD board and mandarins in bringing several pilgrim reforms and making Tirumala temple a role model in Temple Culture. ”There is every need to pass these values to the next generations and I appreciate the services of TTD “, the CM maintained.
Later in the night, he took part in the procession of Pedda Sesha Vahanam.
AP Ministers Sri Anam Ramnarayana Reddy, Sri N Lokesh, Sri Satya Prasad were also present.
Among others, several TTD board members, public representatives were present.
TTD Additional EO Sri Ch Venkaiah Chowdary, CVSO Sri Murali Krishna were present while among the officials the District Collector Dr Venkateswarulu, SP Sri Subbarayudu, several other state level and district officials were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
దేశం, రాష్ట్రం సిరిసంపదలతో వర్ధిల్లాలి : ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు
శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి
తిరుమల, సెప్టెంబరు 15, 2026: దేశం, రాష్ట్రం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీవేంకటేశ్వరస్వామివారిని ప్రార్థించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచి, అభివృద్ధిలో ముందుండేలా స్వామివారు ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీవారి సేవలోప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
టీటీడీ పాలకమండలి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో భక్తులకు సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మన ఆధ్యాత్మిక సంపద, సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని రాబోయే తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
భక్తిశ్రద్ధలతో శ్రీవారి దర్శనం
ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోలు ముఖ్యమంత్రికి శ్రీవారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
2027 టీటీడీ డైరీలు, క్యాలెండర్ల ఆవిష్కరణ
ఈ సందర్భంగా 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అనంతరం శ్రీవారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొని స్వామివారి వైభవాన్ని దర్శించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మానవ వనరులు, ఐటి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ పాలకమండలి సభ్యులు,
జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




























