CLOTHES PRESENTED TO SRIVARI TEMPLE STAFF _ శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం

Tirumala, 20 September 2026: Nellore Lok Sabha Member Sri Vemireddy Prabhakar Reddy and Kovur MLA and TTD Board Member Smt. Vemireddy Prashanthi Reddy jointly presented clothes to the temple service staff on Sunday.

It included Srivari Temple priests, Veda Parayanamdars, Potu personnel, Vahanam Bearers and Melam staff who are rendering dedicated services during the ongoing Srivari Salakatla Brahmotsavams at Tirumala.

The event took place at Vaibhavotsava Mandapam in Tirumala over the hands of TTD Executive Officer Sri Muddada Ravichandra and Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం

బ్రహ్మోత్సవ సేవకులకు వస్త్రాలు అందించిన వేమిరెడ్డి దంపతులు

తిరుమల, 2026 సెప్టెంబరు 20: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మేళం సిబ్బందికి ఆదివారం వస్త్ర బహుమానం అందించారు.

నెల్లూరు లోకసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి ఈ వస్త్ర బహుమానాన్ని అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా సిబ్బందికి వస్త్రాలను అందించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవలందించే సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నారని తెలిపారు. స్వామివారి సేవలో భాగస్వాములవుతున్న సిబ్బందిని ప్రోత్సహిస్తూ వస్త్ర బహుమానం అందించడం అభినందనీయమన్నారు.

శ్రీవారి కృపాకటాక్షాలు వేమిరెడ్డి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని అదనపు ఈవో ఆకాంక్షించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.