JEO REVIEWS ON KRT BTUs _శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

Tirupati, 5 March 2020: The Joint Executive Officer Sri P Basant Kumar on Thursday said elaborate arrangements are underway for the successful conduction of the annual Brahmotsavams of Sri Kodandarama Swamy temple from March 23-31.

He was speaking to reporters after the review with senior officials of all departments and also released the wall posters of Brahmotsavams, Sri Ramanavami utsavam and Theppotsavam at the temple.

He said Brahmotsavams will commence with Dwajarohanam on March 23 and concludes with Chakra Snanam on March 31.

The JEO asked the officials to make elaborate arrangements with flower, electrical and painting of rangoli decorations and also advance testing of vahanams etc.

He directed that the cultural teams of the TTD should gear up with kolatas, Bhakti sangeet etc. He asked water spraying on the Mada streets for devotees benefit against summer. 

He also instructed officials to set up primary health centres, SVBC  live coverage of vahana sevas,  supply of note books to devotees to, write Rama kotis, barricades m adequate number of Srivari Sevakulu,Anna Prasadam ,drinking water,tea,coffee and buttermilk supply.

The JEO also asked the officials to keep the temple clean and also, ready CDs of Annamacharya sankeertans on Kodandarama Swamy and Hanumantha significance.

He also inspected the arrangements at the mada streets like toilets, parking etc. in coordination with local police.

TTD SE 1 Sri Ramesh Reddy,  SE (Electrical) Sri Venkateswarlu, DyEO Smt Shanti, Special Grade DyEOs  Smt Varalakshmi and Smt Jhansi Rani, Sri Govindarajan, Sri Lokanatham, DFO Sri Phanikumar Naidu, Goshala Director DR Harinath Reddy,  Additional Health officer Dr Sunil and others participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

                                                           
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

తిరుపతి, 2020 మార్చి 05 ;తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టాలని టిటిడి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.బ‌సంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ప‌లు విభాగాల అధికారుల‌తో జెఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో జ‌రుగ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాలు, శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్స‌వాలు, తెప్పోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ల‌ను ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మార్చి 23వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 31వ తేదీన చక్రస్నానంతో ముగియనున్నాయని తెలిపారు. అలాగే ఏప్రిల్ 2 నుండి 4వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 5 నుంచి 7వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జరుగనున్నాయని  వివరించారు. ఆల‌యంలో ఆక‌ట్టుకునేలా పెయింటింగ్స్‌, రంగ‌వ‌ళ్లులు తీర్చ‌దిద్దాల‌ని సూచించారు. వాహ‌నాల ప‌టిష్ట‌త‌ను, తండ్ల‌ను ముంద‌స్తుగా త‌నిఖీ చేయాల‌న్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహనసేవల ముందు భక్తులను ఆకట్టుకునేలా భజనలు, కోలాటాలు, ఇతర కళాబృందాల ప్రదర్శనలు ఏర్పాటుచేయాల‌ని ఆదేశించారు. మాడ వీధుల్లో నీటిని పిచికారీ చేసి భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు. బ్రహ్మోత్సవాల శోభను తెలిపేరీతిలో ఆలయ పరిసర ప్రాంతాలలో విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, పుష్పాలంకరణలు ఘనంగా ఏర్పాటు చేయాలన్నారు.

భ‌క్తుల కోసం ప్ర‌థ‌మ చికిత్స కేంద్రం ఏర్పాటుచేయాల‌ని,  ఎస్వీబీసీ ద్వారా వాహ‌న‌సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయాల‌ని జెఈవో ఆదేశించారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ర‌ప్పించాల‌న్నారు. భక్తులు రామకోటి రాసేందుకు వీలుగా పుస్త‌కాలు అందించాలన్నారు. భ‌క్తుల ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు బారీకేడ్లు ఏర్పాటుచేయాల‌ని ఆదేశించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయాలని, తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. శ్రీ‌రామన‌వ‌మి ఉత్స‌వాల సంద‌ర్భంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మాచార్యులు ఈ ఆల‌య ప్రాశ‌స్త్యంపై ర‌చించిన సంకీర్త‌న‌లు, హనుమ‌ద్ సంకీర్తన‌ల సిడిల‌ను సిద్ధం చేయాల‌న్నారు.

ఈ సమావేశంలో టిటిడి ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఆల‌య డ్యెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, శ్రీ గోవింద‌రాజ‌న్‌, శ్రీ లోక‌నాథం, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, గోశాల డైరెక్ట‌ర్ డా.హ‌రినాథ‌రెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాస్‌, అద‌న‌పు ఆరోగ్య‌శాఖాధికారి డా. సునీల్ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఆల‌య మాడ వీధుల‌ను ప‌రిశీలించిన జెఈవో

స‌మీక్ష అనంత‌రం శ్రీ కోదండ‌రామాల‌య నాలుగు మాడ వీధుల‌ను జెఈవో ప‌రిశీలించారు. మ‌రుగుదొడ్ల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. వాహ‌న‌సేవ‌ల స‌మ‌యంలో ట్రాఫిక్ స‌మ‌స్య త‌లెత్త‌కుండా పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.