A MAN CAUSING PUBLIC NUISANCE HELD IN TIRUMALA _ తిరుమ‌ల‌లో ఒక‌రి అరెస్టు, కేసు నమోదు

Tirumala, 20 March 2021: A mentally sick person has been taken into custody in Tirumala in the early hours of Saturday for damaging a  decorative roadside statue and also scaring others in the Padmavati Enquiry office area in the wee hours. A case has also been registered against him by Two Town Police.

However, major damage to the idol was averted with the initiative of the night patrol Vigilance team of TTD who immediately caught the man red-hand and informed police who plunged into action without any delay. Keeping in view the sentiments of devotees, TTD also immediately restored the damaged idol with a new one within a few hours of the incidents.

Going into details K Ramakrishna, a resident of Hanumkonda in the Warangal district of Telangana, he damaged a roadside Statue in the Padmavathi Sub-Enquiry Office area and also scared devotees on the empty roads in the early hours by pelting stones at their vehicles.

Enquiries showed that Ramakrishna is a known patient of Alchohol Dependent Syndrome that led to his rampage act. He had come for Srivari Darshan when the incident occurred. According to his spouse, he was involved in a similar incident about three years ago. Having come to know about his mental condition, TTD vigilance officials and police admitted him to Liquor De-addiction Centre after initial treatment at Manasa Hospital in Tirupati.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో ఒక‌రి అరెస్టు, కేసు నమోదు

తిరుమ‌ల, 2021 మార్చి 20: తిరుమ‌ల‌లోని ప‌ద్మావ‌తి విచార‌ణ కార్యాల‌యం స‌ర్కిల్లో భ‌క్తుల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతోపాటు అక్క‌డే ఉన్న అలంకృత‌ రాతి రథం లోని విగ్రహానికి నష్టం కలిగించినందుకు గాను తిరుమ‌ల టు టౌన్ పోలీసులు శ‌నివారం ఒక‌రిని అరెస్టు చేసి, కేసు న‌మోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా టిటిడి అధికారులు వెంటనే స్పందించి నూతన విగ్రహాన్ని యథాతథంగా ఏర్పాటు చేశారు. టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం అధికారులు, పోలీసులు వెనువెంటనే స్పందించడంతో పెద్దగా నష్టం జరుగకుండా నివారించగలిగారు.

రాత్రి గ‌స్తీ లో భాగంగా పోలీసులు, టిటిడి సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, ఉద‌యం 1.30 గంట‌ల ప్రాంతంలో ప‌ద్మావ‌తి విచార‌ణ కార్యాల‌యం స‌ర్కిల్ వ‌ద్ద తెలంగాణ రాష్ట్రం, వ‌రంగ‌ల్ జిల్లా, హ‌న్మ‌కొండ‌కు చెందిన కె.రామ‌కృష్ణ మాన‌సిక స‌మ‌తుల్యం కోల్పోయి అటువైపు వెళ్తున్న భ‌క్తుల వాహ‌నాల‌ను నిలుపుతూ పెద్ద‌గా అరుస్తుండ‌డాన్ని గుర్తించారు. అదేవిధంగా, అక్క‌డి స‌ర్కిల్‌లోని పూల‌కుండీల‌ను ధ్వంసం చేసి, రాతి రధంలోని విగ్రహానికి నష్టం కల్గించాడు. పోలీసులు వెంట‌నే అత‌డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించారు.

వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం, వ‌రంగ‌ల్ జిల్లా, హ‌న్మ‌కొండ‌కు చెందిన శ్రీమతి పద్మ 15 మంది బృందంతో శ్రీవారి సేవకు నమోదు చేసుకుని మార్చి 10న తిరుమలకు వచ్చారు. మార్చి 17వ తేదీకి శ్రీవారి సేవ గడువు పూర్తయింది. ఆ తరువాత శ్రీవారి దర్శనం కోసం రావాలని తన భర్త అయిన శ్రీ రామకృష్ణను కోరగా ఆయన మార్చి 19న హన్మకొండ నుండి తిరుపతి చేరుకున్నారు. విష్ణునివాసంలో అదేరోజు రాత్రి 7 గంటల టైంస్లాట్ దర్శన టోకెన్ పొంది భార్యాభర్తలు ఇద్దరూ తిరుమల చేరుకున్నారు. నందకంలో తలనీలాలు సమర్పించి అన్నప్రసాదం స్వీకరించి మధ్యాహ్నం 2 గంటలకు దర్శన క్యూ లైన్ లోకి తన భర్త రామకృష్ణను శ్రీమతి పద్మ వదిలిపెట్టింది. తన భర్త కోసం ఆలయం వద్ద వేచి చూసింది. ఎంతకీ రాకపోవడంతో సీసీటీవీలో చూసేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్ళింది. రాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో పోలీసులు ఆమెకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపారు. తన భర్తకు ఆల్కహాల్ డిపెండెంట్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉందని, మూడేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగిందని శ్రీమతి పద్మ చెబుతోంది. ఆమె తెలిపిన వివరాల మేరకు పోలీసులు, టిటిడి విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి మెరుగైన వైద్యం కోసం రామకృష్ణను తిరుపతిలోని మానస్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మత్తు బానిసల పునరావాస కేంద్రానికి అతనిని తరలించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.