KODANDA RAMA RIDES ASWA _ అశ్వ‌వాహనంపై కోదండ రాముడు

Tirupati, 20 Mar. 21: Sri Kodanda Rama Swamy took out a celestial ride on Aswa Vahanam on Saturday evening on the penultimate day of the annual brahmotsavams.

The vahana sevas concluded with Aswa Vahana in Ekantam on Saturday evening.

Special grade Deputy EO Smt Parvati and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అశ్వ‌వాహనంపై కోదండ రాముడు

తిరుపతి, 2021 మార్చి 20: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శ‌ని‌వారం రాత్రి స్వామివారు అశ్వ‌వాహనంపై  దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో  ఏకాంతంగా నిర్వ‌హించారు.అశ్వవాహనం :

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలి దోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి, తరించాలని ప్రబోధిస్తున్నాడు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి,  ఏఈవో శ్రీ  దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.