AARADHANOTSAVAMS OF CARNATIC MUSIC TRINITY OBSERVED _ ఎస్వీ సంగీత కళాశాలలో వైభవంగా సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు

Tirupati, 28 February 2020: The grand Aradhanotsavam of legendary Carnatic Music Trinity – Sri Shyama Shastry, Sri Thiyagaraja Swamy and Sri Muthuswamy Dikshitulu began on a high note at Sri Venkateswara College of Music and Dance in Tirupati on Friday morning.

The faculty of Sri Venkateswara Nadaswaram school kick started the celebrations with a Nadaswaram after initiation special pujas performed by Dr S Jamuna Rani, the Principal of SVCMD.

The events of the day were conducted under the supervision of In-charge Principal Sri M Sudhakar and Sri V Satyanarayana, Harikatha lecturer Sri Simhachalam Shastri. 

Several teams of students and teachers of Music College performed sangeet kacheris to celebrate the Aradhanotsavam of carnatic music trinity.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

ఎస్వీ సంగీత కళాశాలలో వైభవంగా  సంగీత త్రిమూర్తుల ఆరాధనోత్సవాలు

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 28: కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్యామశాస్త్రులు, శ్రీ త్యాగరాజస్వామి,   శ్రీ ముత్తుస్వామి దీక్షితుల ఆరాధనోత్సవాలు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో  శుక్ర‌వారం వైభవంగా జ‌రిగాయి. పలు కీర్తనలు మరుగున పడుతున్న నేపథ్యంలో వాటిని వెలుగులోకి తీసుకువచ్చి విద్యార్థులకు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.

ముందుగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డా. జ‌మునారాణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు కలసి ఉదయం 8.30 గంటలకు కళాశాల ప్రాంగణంలోని శ్రీ వినాయకుడు, శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి శ్రీవారి చిత్రపటాన్ని ఊరేగింపుగా మేళతాళాల మధ్య కళాశాల వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత ఎస్వీ నాదస్వర పాఠశాల హెడ్‌మాస్టర్‌ శ్రీ వి.సత్యనారాయణ బృందం, శ్రీ.హరిబాబు, శ్రీమతి లక్ష్మీసువర్ణ బృందాలు నాదస్వర వాద్య సంగీత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు సంగీత కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు, పూర్వవిద్యార్థులు పలు కీర్తనలను వీనులవిందుగా ఆలపించారు.

ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు శ్రీ శ‌బ‌రిగిరిష్‌, శ్రీ‌మ‌తి కె.వంద‌న‌, శ్రీ శైల‌జ‌, శ్రీ‌మ‌తి చిన్న‌మ్మ‌దేవి బృందం  ” గ‌ట్టిగాను చేయిప‌ట్టి …., బ్రోవ స‌మ‌య‌ము…., హిమ‌గిరి కుమారి ….” తదితర కీర్తనలు అల‌పించారు. అనంత‌రం శ్రీ ఎ.చెన్నయ్య, శ్రీ అనంత‌కృష్ణ‌ వేణువు, శ్రీమతి జి.జ్ఞానప్రసూన, శ్రీ‌మ‌తి వాణి వీణ, శ్రీ కె.వెంకటకృష్ణ శ్రీ చెన్న‌య్య‌, శ్రీ జ‌య‌రాం, శ్రీ పూర్ణ వైద్య‌నాథ‌న్ బృందం వయొలిన్‌ వాద్య ప్రదర్శనలిచ్చారు.

ఈ కార్యక్రమంలో హ‌రిక‌థ విభాగాదిప‌తి శ్రీ సింహాచ‌ల శాస్త్రి, అధ్యాప‌కులు శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, కళాకారులు, పురప్రజలు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.