ACCOMMODATION COMPLAINT TRACKING SYSTEM FOR DEVOTEES BENEFIT- ADDITIONAL EO _ గ‌దులు పొందే యాత్రికుల సౌక‌ర్యార్థం కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 20 July 2021: TTD Additional Executive Officer Sri A V Dharma Reddy on Tuesday directed the officials concerned to design an exclusive complaint tracking system app for accommodation for the benefit of devotees taking rooms at Tirumala.

During a review meeting with senior officials in the Conference Hall at Gokulam Rest House, the TTD Additional EO instructed IT officials to set up a complaint tracking App which would highlight the suggestions and complaints raised by devotees with regard to the amenities including furniture, beds, taps, cleanliness, lights and others in thousands of rooms located at Tirumala.

He asked the officials to provide a separate mobile number to receive information, suggestions and complaints with regard to such issues about rooms at Tirumala. He also said this number should be included in the stickers pasted at all rooms for the benefit of devotees.

The SMS from devotees shall be uploaded into the complaint tracking system and also the staff strength in the Reception wing be increased to address these complaints without delay.

Earlier the Additional EO also reviewed on the issues concerned with the devotees entry through Supatham route to Srivari temple.

DyEOs Sri Ramesh Babu, Sri Lokanatham, Sri Bhaskar, Sri Harindranath, IT Chief Sri Shesha Reddy, VGO Sri Bali Reddy, EE (FMS) Sri Mallikarjuna Prasad and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గ‌దులు పొందే యాత్రికుల సౌక‌ర్యార్థం కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 20 జులై 2021: గ‌దులు పొందే యాత్రికుల సౌక‌ర్యాల‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు/సూచ‌న‌లు వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ అప్లికేష‌న్ రూపొందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఐటి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల గోకులంలో గ‌ల కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం  అద‌న‌పు ఈవో వివిధ విభాగాల అధికారులతో స‌మావేశం నిర్వ‌హించారు.  

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో వేలాది గ‌దులు ఉన్నాయ‌ని, ఆయా ప్రాంతాల్లో గ‌దులు పొందిన యాత్రికులు ఫ‌ర్నీచ‌ర్‌, ప‌రుపులు, కొళాయిలు, ప‌రిశుభ్ర‌త‌, లైట్లు త‌దిత‌ర‌ స‌మ‌స్య‌ల‌ను తెలిపేందుకు వీలుగా ప్ర‌త్యేకంగా సెల్ నంబ‌రు ఏర్పాటు చేయాల‌ని రిసెప్ష‌న్ అధికారులను ఆదేశించారు. ఈ నంబ‌రుతో పాటు అవ‌స‌ర‌మైన ఇత‌ర స‌మాచారాన్ని అన్ని గ‌దుల్లో స్టిక్క‌ర్ల ద్వారా యాత్రికుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. గ‌దులు పొందిన యాత్రికుల‌కు పంపే ఎస్ఎంఎస్‌లో కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ స‌మాచారం ఉంచాల‌న్నారు. యాత్రికుల ఫిర్యాదులు/సూచ‌న‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేందుకు వీలుగా రిసెప్ష‌న్ విభాగం త‌గినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. గ‌దుల్లో మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.

అంత‌కుముందు సుప‌థం మార్గం ద్వారా భ‌క్తుల ప్ర‌వేశానికి సంబంధించి ఆల‌య అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మీక్షించారు.

ఈ స‌మావేశాల్లో డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్‌, ఐటి విభాగాధిప‌తి శ్రీ శేషారెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఈఈ(ఎఫ్ఎంఎస్‌) శ్రీ మ‌ల్లికార్జున ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.